త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nobel Prize 2026 | భౌతిక‌శాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జ‌న్‌కు నోబెల్‌

Nobel Prize 2026 | భౌతిక‌శాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రాన్సిస్ హాల్జ‌న్ (Francis Halzen)కు ద‌క్కింది.

D

International | Published On Oct 6, 2026, 4.14 pm IST

Nobel Prize 2026 | భౌతిక‌శాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జ‌న్‌కు నోబెల్‌
Advertisement

Nobel Prize 2026 | త్రినేత్ర న్యూస్ : 2026 ఏడాదికిగానూ భౌతిక‌శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రాన్సిస్ హాల్జ‌న్ (Francis Halzen)కు ద‌క్కింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (IceCube Neutrino Observatory) ఏర్పాటుకు అందించిన విశేష సేవలతో పాటు ఖగోళ మూలాలు కలిగిన అత్యుత్తమ శక్తివంతమైన న్యూట్రినోలను (Astrophysical Neutrinos) కనుగొన్నందుకు గానూ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (The Royal Swedish Academy of Sciences) ఆయ‌న్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

అంటార్కిటికాలోని మంచు కొండలను ఉపయోగించి విశ్వంలో అత్యంత రహస్యంగా సంచరించే న్యూట్రినో (Neutrino) కణాలను గుర్తించవచ్చని హాల్జెన్ ప్రతిపాదించిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. ఆయన ఆలోచనల నుంచి పుట్టిందే ప్రపంచ ప్రసిద్ధ 'ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ' (IceCube Neutrino Observatory) అని పేర్కొంది. కాగా, గ‌తేడాది భౌతిక‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఎల‌క్ట్రిక్ సర్క్యూట్‌లో సంభ‌వించే ఎన‌ర్జీ క్వాంటిజేష‌న్‌పై చేప‌ట్టిన డిస్క‌వ‌రీకి గుర్తింపుగా.. జాన్ క్లార్క్‌, మైఖేల్ హెచ్ దేవ‌రేట్‌, జాన్ ఎం మార్టినిస్‌ల‌కు సంయుక్తంగా అవార్డును ప్ర‌క‌టించారు.

మెదడు గుట్టుపై అధ్య‌య‌నం చేసినందుకు ఈ ఏడాది ఇప్ప‌టికే ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు వైద్య నోబెల్ (Nobel Prize) ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఇవాళ భౌతిక‌శాస్త్రంలో నోబెల్ ప్ర‌క‌టించింది రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ. రేపు కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగాల‌కు సంబంధించిన విజేత‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. శుక్ర‌వారం శాంతి బ‌హుమ‌తిని ప్ర‌క‌టిస్తారు. అక్టోబర్ 12న అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని వెల్లడించనున్నారు.

Also Read..

విలేక‌రుని క‌సురుకున్న జ‌యా బ‌చ్చ‌న్‌.. మైక్‌ను ప‌క్క‌కు నెట్టేసి

రాహుల్ రామ‌కృష్ణ సూప‌ర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు

అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్య‌క్తికి రిమాండ్ విధించిన కోర్టు

Advertisement
Advertisement