త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్య‌య‌నం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్‌

Nobel Prize 2026 | 2026 ఏడాదికి గానూ వైద్య శాస్త్రంలో (Nobel Medicine Prize) ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బహుమతి (Nobel Prize) ద‌క్కింది. మెద‌డు గుట్టుపై అధ్య‌య‌నం చేసిన (Research Into Brain Activity) అమెరికాకు చెందిన కార్ల్ డీస్సెరొత్ (Karl Deisseroth), జర్మనీకి చెందిన పీటర్ హెగెమాన్ (Peter Hegemann), జార్జ్ నాజెల్‌ను (Georg Nagel) ఈ ఏడాది నోబెల్ వ‌రించింది.

D

International | Published On Oct 5, 2026, 4.09 pm IST

Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్య‌య‌నం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్‌
Advertisement

Nobel Prize 2026 | త్రినేత్ర న్యూస్ : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల (Nobel Prize 2026) ప్రకటన ప్రారంభమైంది. 2026 ఏడాదికి గానూ వైద్య శాస్త్రంలో (Nobel Medicine Prize) ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బహుమతి (Nobel Prize) ద‌క్కింది. మెద‌డు గుట్టుపై అధ్య‌య‌నం చేసిన (Research Into Brain Activity) అమెరికాకు చెందిన కార్ల్ డీస్సెరొత్ (Karl Deisseroth), జర్మనీకి చెందిన పీటర్ హెగెమాన్ (Peter Hegemann), జార్జ్ నాజెల్‌ను (Georg Nagel) ఈ ఏడాది నోబెల్ వ‌రించింది.

కాంతి ద్వారా జీవకణాల్లోని అయాన్ ఛానెళ్లను నియంత్రించే పద్ధతులు, నాడి వ్యవస్థ కణాల పనితీరును అధ్యయనం చేసే ఆప్టోజెనెటిక్స్ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో వారు చేసిన అద్భుతమైన ఆవిష్కరణలకు గానూ నోబెల్ కమిటీ వారిని ఈ బ‌హుమ‌తికి ఎంపిక చేసింది. మెద‌డులో క‌లిగే ఆలోచ‌న‌లు, జ్ఞాప‌కాలు, భావోద్వేగాలు, ప్ర‌వ‌ర్త‌న‌ల గురించి వీరు అధ్య‌య‌నం చేస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. కాగా గ‌తేడాది రోగనిరోధక వ్యవస్థపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఇవాళే అధికారికంగా నోబెల్ పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌వారం ఫిజిక్స్‌, బుధ‌వారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగాల‌కు సంబంధించిన విజేత‌ల పేర్ల‌ను నోబెల్ క‌మిటీ ప్ర‌క‌టించనుంది. శుక్ర‌వారం శాంతి బ‌హుమ‌తిని ప్ర‌క‌టిస్తారు. అక్టోబర్ 12న అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని వెల్లడించనున్నారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్‌ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తూ వ‌స్తున్నారు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది అవార్డు గ్రహీతలకు 12 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ నగదు అందుతుంది.

Also Read..

ట్వీట్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు సార్‌.. సీఎం రేవంత్ అక్ర‌మ సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించండి.. మ‌న్నె క్రిషాంక్‌

కోహినూర్‌లో 25 శాతం వాటా తీసుకున్న‌వ్‌.. అయ్యకు అబ్బకు పుడ్తే అబ‌ద్ద‌మ‌ని చెప్పు

జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక ప్రతిపాదనలు.. వీటిపై పన్ను భారం తగ్గే ఛాన్స్..?

Advertisement
Advertisement