త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Human Trafficking Case | మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైద‌రాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచ‌ల‌న తీర్పు

Human Trafficking Case | 2019 మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసు (Human Trafficking Case)లో హైద‌రాబాద్‌లోని ప్ర‌త్యేక‌ ఎన్ఐఏ కోర్టు (special NIA court in Hyderabad) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. తొమ్మిది మంది నిందితుల‌కు జీవిత‌ఖైదు విధించింది.

D

National | Published On Sep 18, 2026, 11.37 am IST

Human Trafficking Case | మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైద‌రాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచ‌ల‌న తీర్పు
Advertisement

Human Trafficking Case | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌లోని ప్ర‌త్యేక‌ ఎన్ఐఏ కోర్టు (special NIA court in Hyderabad) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 2019లో వెలుగు చూసిన‌ మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసు (Human Trafficking Case)లో తొమ్మిది మంది నిందితుల‌కు జీవిత‌ఖైదు విధించింది. ఇందులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు ఉన్నారు.

2019లో బంగ్లాదేశ్ నుంచి మ‌హిళ‌ల‌ను అక్ర‌మంగా భార‌త్‌కు త‌ర‌లించిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని మ‌హిళ‌ల‌ను న‌మ్మించి వారిని బ‌ల‌వంతంగా వ్య‌భిచారంలోకి దింపారు. ఈ ఘ‌ట‌న‌పై 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లోని వ్య‌భిచార గృహాల నుంచి ప‌లువురు బంగ్లాదేశీ మ‌హిళ‌ల‌ను గుర్తించి వారిని ర‌క్షించారు. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌ర్వాత ఈ కేసు ద‌ర్యాప్తును ఎన్ఐఏ టేక‌ప్ చేసింది.

బాధితుల‌కు నిందితులు మంచి జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి అక్ర‌మంగా భార‌త్‌కు త‌ర‌లించి వ్య‌భిచార కూపంలోకి దింపిన‌ట్లు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఈ అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్పడిన ముఠా గుట్టును ర‌ట్టు చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌, తెలంగాణ త‌దిత‌ర ప్రాంతాల్లో నిందితుల‌ను గుర్తించి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. 12 మంది నిందితుల‌పై అక్టోబ‌ర్ 17, 2020లో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసింది. నిందితుల‌పై మోపిన నేరం రుజువు చేయ‌డంతో కోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

ఏడేళ్ల విచార‌ణ త‌ర్వాత ఎన్ఐఏకి ద‌క్కిన విజ‌యం

ఎనిమిది మంది బంగ్లాదేశ్ జాతీయులతో సహా మొత్తం తొమ్మిది మంది దోషులకు ప్రత్యేక NIA కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషులంద‌రికీ క‌లిపి మొత్తం రూ.1,37,000 జ‌రిమానా కూడా విధించింది. ఒక‌వేళ జ‌రిమానా చెల్లించ‌లేని ప‌క్షంలో అద‌నంగా మ‌రో మూడు నెల‌ల సాధార‌ణ జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. కోర్టు తీర్పుతో దాదాపు ఏడేళ్ల విచార‌ణ త‌ర్వాత ఎన్ఐఏకి ఈ చ‌రిత్రాత్మ‌క విజ‌యం ద‌క్కిన‌ట్లైంది.

దోషుల వివ‌రాలు ఇవే..

రుహుల్ అమిన్ ధాలి, మొహ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ ఎండీ ఇమ్రాన్‌, బీథీ బేగం అలియాస్ ఖదీజా షేక్, ఇమాముల్ గాజీ అలియాస్ మొహ్మద్ రాణా హుస్సేన్, మొహమ్మద్ అల్ మామున్, సోజిబ్ షేక్, సురేష్ కుమార్ దాస్ అలియాస్ సాగర్, మొహ్మద్ అబ్దుల్లా మున్షి అలియాస్ అబ్దుల్ సర్కార్, మొహ్మద్ అయూబ్ షేక్ ఈ కేసులో దోషులుగా ఉన్నారు.

Also Read..

6 నెల‌ల ప‌సికందుపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో

మైన‌ర్‌పై గ్యాంగ్‌రేప్‌.. ఆపై హ‌త్య‌.. శ‌వాన్ని పీక్కుతిన్న కుక్క‌లు

ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్

Advertisement
Advertisement