Air India Express | బ్రీత్‌టెస్ట్‌కు హాజరుకాని ఎయిర్ ఇండియా సిబ్బంది.. 8 మందిపై వేటు
Air India Express | బ్రీత్ అనలైజర్ పరీక్ష (Breathalyser Test)ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో విఫలమైన ఎనిమిది మంది సిబ్బందిని ఎయిర్ ఇండియా (Air India) సంస్థ సస్పెండ్ చేసింది (Crew Suspended).
Air India Express | త్రినేత్ర.న్యూస్ : దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India ) కీలక నిర్ణయం తీసుకుంది. విమానం దిగిన తర్వాత నిర్వహించాల్సిన తప్పనిసరి బ్రీత్ అనలైజర్ పరీక్ష (Breathalyser Test)ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో విఫలమైన ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసింది (Crew Suspended).
ఆగస్ట్ 2వ తేదీన AX-192 విమానం దుబాయ్ నుంచి అమృత్‌సర్ చేరుకుంది. శ్రీగురు రామ్ దాస్‌జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 9:50 గంటలకు ల్యాండ్ అయ్యింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం.. సిబ్బంది విమానం ల్యాండ్ అయిన రెండు గంటల్లోపు తప్పనిసరిగా ఆల్కహాల్ పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ గడువును కచ్చితంగా పాటించాల్సిందే. అయితే, వారు 35 నిమిషాలు ఆలస్యంగా బ్రీత్ అనలైజర్ (Breathalyser Test) పరీక్షకు హాజరయ్యారు.
ఆల్కహాల్ పరీక్షలో వారికి నెగెటివ్ వచ్చినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించినందుకు 8 మందిని విధుల నుంచి తొలగించింది. మూడు నెలల పాటూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేటుపడిన వారిలో నలుగురు పైలట్లు, నలుగురు కేబిన్ సిబ్బంది ఉన్నారు. కాగా, ఇటీవలే పుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమాన పైలట్‌కు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ (Breathalyser Test) పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. పైలట్-ఇన్-కమాండ్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో తేలింది. ఈ ఘటన తర్వాత ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రైస్ పైలట్లందరికీ డోప్ టెస్ట్‌ను తప్పనిసరి చేశారు.
Also Read..
మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
ఇండిగో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు..
మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
సంబంధిత వార్తలు

Air India | ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో భారీ వైఫల్యం.. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు
సెప్టెంబర్ 15, 2026

Air India Express | విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఇంజిన్-1లో తగ్గిపోయిన ఆయిల్
సెప్టెంబర్ 7, 2026

Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు
- ●KCR Farm house | కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ ఉన్న భూముల వివరాలివే.. యజమానులు వీరే
- ●UPI | క్రెడిట్ కార్డు బిల్లును యూపీఐతో కడుతున్నారా? ఎండీఆర్‌పై కీలక క్లారిటీ
- ●Rahul Gandhi | మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
- ●KTR | రేవంత్.. రూ. 1000 కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం రాసిస్తా
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు..

Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు

KCR Farm house | కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ ఉన్న భూముల వివరాలివే.. యజమానులు వీరే

UPI | క్రెడిట్ కార్డు బిల్లును యూపీఐతో కడుతున్నారా? ఎండీఆర్‌పై కీలక క్లారిటీ

Rahul Gandhi | మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు



