త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | ర‌ద్దీగా మారిన బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు

TGSRTC | ద‌స‌రా సెల‌వుల( Dasara Holidays ) నేప‌థ్యంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ప్ర‌ధాన బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా మారాయి. త‌మ సొంతూర్ల‌కు వెళ్లేందుకు ప్ర‌యాణికులు భారీ సంఖ్య‌లో బ‌స్టాండ్ల‌కు చేరుకుంటున్నారు. బ‌స్సుల్లో సీట్ల కోసం ప్ర‌యాణికులు పాట్లు ప‌డుతున్నారు.

S

Telangana | Published On Oct 10, 2026, 2.36 pm IST

TGSRTC | ర‌ద్దీగా మారిన బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు
Advertisement

కిట‌కిట‌లాడుతున్న ఎంజీబీఎస్, జేబీఎస్
సీట్ల కోసం పాట్లు ప‌డుతున్న ప్ర‌యాణికులు

TGSRTC | త్రినేత్ర న్యూస్ : ద‌స‌రా సెల‌వుల( Dasara Holidays ) నేప‌థ్యంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ప్ర‌ధాన బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా మారాయి. త‌మ సొంతూర్ల‌కు వెళ్లేందుకు ప్ర‌యాణికులు భారీ సంఖ్య‌లో బ‌స్టాండ్ల‌కు చేరుకుంటున్నారు. బ‌స్సుల్లో సీట్ల కోసం ప్ర‌యాణికులు పాట్లు ప‌డుతున్నారు.

ఎంజీబీఎస్( MGBS ), జేబీఎస్( JBS ) బస్టాండ్ల‌లో ప్ర‌యాణికులు బ‌స్సుల కోసం వేచి చూస్తున్నారు. ప‌లు కుటుంబాలు త‌మ పిల్ల‌ల‌తో బ‌స్టాండ్ల‌కు చేరుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచిగూడ‌, లింగంప‌ల్లి రైల్వే స్టేష‌న్లు కూడా ప్ర‌యాణికుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.

ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ న‌గ‌ర్, కేపీహెచ్‌బీ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచారు.

Advertisement
Advertisement