VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం
VC Sajjanar | ఫోన్ మాట్లాడుకుంటూ.. చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్( VC Sajjanar ) హెచ్చరించారు. ఇలాంటి డ్రైవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
VC Sajjanar | త్రినేత్ర న్యూస్ : ఫోన్ మాట్లాడుకుంటూ.. చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్( VC Sajjanar ) హెచ్చరించారు. ఇలాంటి డ్రైవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంపై సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్ఫోన్లు! ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం అని సజ్జనార్ పేర్కొన్నారు. .
ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి. వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకం. ఈ క్రమంలో ప్రయాణం ఆటో అయినా, కారు అయినా, బస్సు అయినా ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.
డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని వెంటనే ప్రశ్నించండి, వారించండి. ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలి అని సజ్జనార్ సూచించారు.
తాజావార్తలు
- ●FII Selling | భారత మార్కెట్లపై ఎఫ్ఐఐల పిడుగు.. సెప్టెంబర్‌లో 4.1 బిలియన్ డాలర్ల మేర విక్రయాలు..
- ●Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్ నల్లగొండ మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు..: గుత్తా సుఖేందర్ రెడ్డి
- ●India Wholesale Inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతానికి జంప్.. ఇంధన ధరలే కారణం..
- ●Anish Gawande | కత్తులతో వచ్చిన వారికి బెయిల్.. జాతీయ జెండా ఊపితే తీహార్ జైలా?
- ●Liquor Price Hike | దసరా పండుగ వేళ మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన విదేశీ మద్యం ధరలు
- ●Abhijeet Dipke | పార్టీ పెట్టం. ప్రెజర్ గ్రూప్ గానే ఉంటాం

FII Selling | భారత మార్కెట్లపై ఎఫ్ఐఐల పిడుగు.. సెప్టెంబర్‌లో 4.1 బిలియన్ డాలర్ల మేర విక్రయాలు..

Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్ నల్లగొండ మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు..: గుత్తా సుఖేందర్ రెడ్డి

India Wholesale Inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతానికి జంప్.. ఇంధన ధరలే కారణం..

Anish Gawande | కత్తులతో వచ్చిన వారికి బెయిల్.. జాతీయ జెండా ఊపితే తీహార్ జైలా?






