Ceasefire | యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ 10 సూత్రాల ప్రతిపాదన ఇదే..
Ceasefire | అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ (Iran) పది సూత్రాలతో ఒక ప్రతిపాదన పంపించింది.
International | Published On Apr 8, 2026, 10.33 am IST
Ceasefire | అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ (Iran) పది సూత్రాలతో ఒక ప్రతిపాదన పంపించింది. ఇరాన్ పంపిన ఆ ప్రతిపాదనలోని అంశాలన్నీ సానుకూలంగానే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇక ఈ సీజ్‌ఫైర్ తమ విజయంగా ఇరాన్ ప్రకటించుకుంది. ఈమేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన విడుదలచేసింది. యుద్ధంలో ఇరాన్ నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలు దాదాపు నెరవేరాయని కౌన్సిల్ పేర్కొంది. తమ 10 అంశాల ప్రణాళికను ట్రంప్ ఆమోదించేలా చేయడం ద్వారా విజయం సాధించినట్లు వివరించింది.
ఇరాన్ పది సూత్రాల ప్రతిపాదన ఇదే..
- ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర దాడులకు దిగకూడదు.
- హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు
- యురేనియం సుసంపన్నతకు అంగీకారం
- అమెరికా విధించిన అన్ని రకాల ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలను రద్దు చేయాలి
- తమ దేశానికి చెందిన అన్ని విభాగాలపై యుద్ధం ముగింపు
- పశ్చిమాసియాలోని అన్ని స్థావరాల నుంచి అమెరికా దళాల ఉపసంహరణ
- ఇరాన్‌కు జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి
- ఇరాన్‌పై IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలు రద్దు చేయాలి
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని తీర్మానాలను రద్దు చేయాలి
- విదేశాలలో స్తంభింపజేసిన అన్ని ఇరానియన్ ఆస్తులు విడుదల
Also Read..
కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు : మొజ్తాబా ఖమేనీ
యుద్ధానికి బ్రేక్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
రణ్‌వీర్ నా లక్కీ చార్మ్.. మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా






