Israel Strikes Lebanon | లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి.. హర్మూజ్‌ను మూసివేసిన ఇరాన్
Israel Strikes Lebanon | లెబనాన్‌పై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి (Israel Strikes Lebanon). లెబనాన్‌లోని హెజ్బుల్లా గ్రూపులే లక్ష్యంగా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100కుపైగా వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 250 మంది ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Apr 9, 2026, 11.39 am IST
Israel Strikes Lebanon | అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. ఈ సీజ్‌ఫైర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. అయితే, అదే సమయంలో లెబనాన్‌పై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి (Israel Strikes Lebanon). లెబనాన్‌లోని హెజ్బుల్లా గ్రూపులే లక్ష్యంగా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100కుపైగా వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1,000 మంది గాయపడ్డారు. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు నిరసనగా.. అమెరికాతో కాల్పుల విరమణ ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, బుధవారం తెల్లవారుజామున అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇందులో భాగంగానే ప్రపంచ ఇంధన సరఫరాను పునరుద్ధరించే ఉద్దేశంతో ఇరాన్ హర్మూజ్‌ను తెరిగి తెరిచేందుకు అంగీకారం తెలిపింది. అయితే, అదే సమయంలో (కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత) లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఐడీఎఫ్ దాడులను ఖండించిన ఇరాన్.. ఈ మేరకు జలసంధిని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సీజ్‌ఫైర్‌లో భాగంగా తన మిత్రదేశాలపై దాడులను ఆపాలని ఇరాన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అందుకు ఇజ్రాయెల్ అంగీకరించలేదు. ఇరాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయానికి బహిరంగంగా మద్దతు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.. ఇది లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు.
Also Read..
మహిళల సహకారం అపారమైనది.. రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి : ప్రధాని మోదీ
ప్రభుత్వ పథకం పేరుతో.. ఏకంగా ఎమ్మెల్యేకే బురిడీ
తల్లి మందలించిందని.. సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 14 ఏండ్ల బాలుడు
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ షురూ
జూన్ 27, 2026

India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులతో.. హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు వస్తున్న 30 భారీ నౌకలు
జూన్ 25, 2026

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



