Strait of Hormuz | ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. లేదంటే ధ్వంసమే.. హర్మూజ్‌పై పట్టుకు ఇరాన్ కొత్త ప్లాన్
Strait of Hormuz | ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై తన పట్టుబిగించాలని ఇరాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్ల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయాలని భావిస్తోంది.
International | Published On Apr 9, 2026, 12.29 pm IST
Strait of Hormuz | ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై తన పట్టుబిగించాలని ఇరాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్ల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున టోల్ విధించాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు ఫైనాన్సియల్ టైమ్స్ నివేదించింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అయితే, నిన్న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఈ జలసంధిని ఇరాన్ తెరిచింది. అయితే, యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన టెహ్రాన్.. షిప్పింగ్ మార్గాలపై తనకున్న పట్టును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఇందులో భాగంగానే టోల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి.. కీలకమైన జలసంధిపై మరింత పట్టు సాధించాలని యోచిస్తోంది.
క్రిప్టో రూపంలో టోల్ వసూలు..
ఈ టోల్ ఫీజును డాలర్లు లేదా యూరోల వంటి సంప్రదాయ కరెన్సీల్లో కాకుండా క్రిప్టోకరెన్సీల రూపంలో స్వీకరించాలని ఇరాన్ భావిస్తోందట. జలసంధి గుండా వెళ్లే అన్ని నౌకలను పర్యవేక్షించి, నియంత్రించాలని టెహ్రాన్ భావిస్తోంది. నౌకల ప్రయాణానికి అనుమతి ఇచ్చే ముందు ప్రతి ట్యాంకర్‌లోని సరకును పరిశీలిస్తారు.. అందులో ఎంత సరకు ఉందో అంచనా వేసి దానికి తగ్గట్టు టోల్ వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హుస్సేనిని ఉటంకిస్తూ ఫైనాన్సియల్ టైమ్స్ నివేదించింది.
నౌకల రాకపోలపై కఠిన నిబంధనలు..
టోల్ విధించడమే కాకుండా ఈ మార్గంలో నౌకల రాకపోకలపై మరింత కఠినమైన నిబంధనలను తీసుకురావాలని ఇరాన్ యోచిస్తోంది. ప్రతి ట్యాంకర్‌లోని సరకు వివరాలను, గమ్యస్థానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రయాణానికి అనుమతివ్వాలని ఇరాన్ అధికారులు భావిస్తున్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఇరాన్ ఈ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే, వాస్తవానికి ఈ సముద్ర మార్గంపై ఇరాన్ తన పట్టును, ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అనుమతి లేకుండా వెళ్లాలని చూస్తే ధ్వంసమే..
ఇక ముందస్తు అనుమతి లేకుండా జలసంధిని దాటే ప్రయత్నం చేస్తే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్యాంకర్లకు రేడియో ప్రసారాల ద్వారా హెచ్చరికలు అందాయని సదరు నివేదిక వెల్లడించింది. "ఒకవేళ ఏ నౌకైనా అనుమతి లేకుండా జలసంధి గుండా వెళ్లాలని చూస్తే ధ్వంసం చేస్తాం" అని అందులో హెచ్చరించారట.
ఇరాన్ నిర్ణయంపై ఆందోళనలు..
ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల చమురు సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇరాన్ కఠిన నిర్ణయాల వల్ల ప్రయాణ సమయం పెరిగి సరఫరాలో జాప్యం జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇంధన ధరలు కూడా పెరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ టోల్ నిర్ణయాన్ని అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే.. పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉంది.
Also Read..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి.. హర్మూజ్‌ను మూసివేసిన ఇరాన్
మహిళల సహకారం అపారమైనది.. రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి : ప్రధాని మోదీ
తల్లి మందలించిందని.. సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 14 ఏండ్ల బాలుడు
సంబంధిత వార్తలు

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
జులై 3, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ షురూ
జూన్ 27, 2026

India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులతో.. హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు వస్తున్న 30 భారీ నౌకలు
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



