Blast Near Mosque | మసీదులో భారీ పేలుడు.. 15 మంది మృతి
Blast Near Mosque | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభవించింది (Blast Near Mosque). ఓ మసీదులో భారీ శబ్ధంతో సంభవించిన పేలుడు ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Sep 18, 2026, 4.01 pm IST
Blast Near Mosque | త్రినేత్ర.న్యూస్ : పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభవించింది (Blast Near Mosque). ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ (Kohat) ప్రాంతంలో గల ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలోని ఓ మసీదులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయపడ్డారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం ఓల్డ్ పోలీసు లైన్ గేటును ఢీ కొట్టడంతో ఈ పేలుడు సంభవించింది. ఆ వెంటనే కాల్పుల శబ్దం కూడా వినిపించింది. పేలుడు ధాటికి సమీపంలోని మసీదు తీవ్రంగా దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.
ఆ ప్రాంతాన్ని పోలీసులు, భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న నివాస భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ దాడికి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. కుట్ర వెనుక ఉన్న వ్యక్తుల ఆచూకీ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
నిఠారీ వరుస హత్యల కేసు.. సురేందర్ కోలీ ఆత్మహత్య
ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు
మహిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్
సంబంధిత వార్తలు

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను మరోసారి ఎండగట్టిన భారత్
సెప్టెంబర్ 17, 2026

Hindu Temple Demolition | పాక్‌లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్
సెప్టెంబర్ 3, 2026

Blast At Cracker Manufacturing Unit | బాణసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు.. 11 మంది మృతి
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●ACB Rides in Kotthagudem dist | మహిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం
- ●Deepika Padukone | ప్రొడ్యూసర్‌గా దీపికా పడుకోణ్ - కల్కి కాంబో రిపీట్
- ●ACB Rides | ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్
- ●Surendra Koli | నిఠారీ వరుస హత్యల కేసు.. సురేందర్ కోలీ ఆత్మహత్య
- ●Brahmotsavam | కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప.. పరవరించిన భక్తజనం..!

ACB Rides in Kotthagudem dist | మహిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం

Deepika Padukone | ప్రొడ్యూసర్‌గా దీపికా పడుకోణ్ - కల్కి కాంబో రిపీట్

ACB Rides | ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్



