Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ – రిలీజ్ డేట్ కన్ఫామ్
కోలీవుడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ ఏమో ఏమో ఇది రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతుంది. రోషన్ మేక హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Sep 21, 2026, 8.12 pm IST
Preity Mukhundhan | తమిళ హీరోయిన్ ప్రీతి ముకుందన్ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ తో కెమెరా ముందుకొచ్చింది. తెలుగులో ఎక్కువగా రొమాంటిక్, గ్లామర్ పాత్రలు చేసిన ఈ బ్యూటీ తమిళం, మలయాళంలో మాత్రం డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇటీవలే రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బ్లాస్ట్‌జోన్ మూవీలో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యమున్న యువతిగా యాక్షన్ రోల్‌లో అదరగొట్టింది.
యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ...
ప్రస్తుతం ప్రీతి ముకుందన్ తెలుగులో ఏమో ఏమో ఇది పేరుతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తోన్నారు.
రిలీజ్ డేట్ కన్ఫామ్...
ఏమో ఏమో ఇది రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 30న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. డైరెక్టర్‌గా ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమాలు చేసిన శైలేష్ కొలను...ఫస్ట్ టైమ్ ఈ సినిమాతో రొమాంటిక్ జానర్‌ను టచ్ చేస్తున్నారు. తల్లిదండ్రులే లోకంగా బతికే ఓ మిడిల్ క్లాస్ యువకుడికి, ఇండిపెండెంట్‌గా జీవించాలని కలలు కనే యువతికి మధ్య ప్రేమకథతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. పెళ్లి సందడి, ఛాంపియన్ తర్వాత రోషన్ మేక హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. హిట్ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు శైలేష్ కొలను. హిట్ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. ఇవన్నీ కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యఏమో ఏమో ఇది సినిమాను నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sree Vishnu Movie | శ్రీవిష్ణు సరసన ‘సర్దార్ 2’ భామ.. సితార బ్యానర్లో మూవీ..!
సెప్టెంబర్ 7, 2026

Preity Mukhundhan | చీరలో బ్లాస్ట్ జోన్ హీరోయిన్ అందాలు అదుర్స్
ఆగస్టు 8, 2026

Meenakshi Chaudhary | లక్కీ భాస్కర్ డైరెక్టర్‌తో మీనాక్షి చౌదరి తెలుగు వెబ్‌సిరీస్ – సినిమాకు మించిన బడ్జెట్‌తో…
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం



