Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy | భూములు ఇచ్చిన రైతుల చేతికి పరిహారం చేరాలి.. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టాలి. ప్రభుత్వ ఖాతాల్లో నిధులు ఉండి.. భూసేకరణ మాత్రం నత్తనడకన సాగితే సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy | భూములు ఇచ్చిన రైతుల చేతికి పరిహారం చేరాలి.. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టాలి. ప్రభుత్వ ఖాతాల్లో నిధులు ఉండి.. భూసేకరణ మాత్రం నత్తనడకన సాగితే సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాసం–పునర్వ్యవస్థీకరణ కోసం ఇప్పటికే విడుదలైన రూ.813 కోట్లను వెంటనే రైతులకు చెల్లించాలని జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, పరిహారం చెల్లింపులపై సోమవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రూ.3,101 కోట్ల విలువైన టోకెన్లు సమర్పించగా.. ప్రభుత్వం రూ.2,504 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో ప్రస్తుతం రూ.813 కోట్లు చెల్లింపులకు పెండింగ్‌లో ఉండగా.. రూ.502 కోట్లు భూసేకరణ అధికారుల వద్ద, రూ.311 కోట్లు కలెక్టర్ల వద్ద ఉన్నాయని తెలిపారు.
రైతుల వద్దకే డబ్బు చేరాలి
నిధులు విడుదలైన తర్వాత అవి రైతులకు చేరకుండా ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు స్వయంగా జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడి.. అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాస్తవమైన కారణాలతో చెల్లింపు సాధ్యం కాకపోతే నిధులను తిరిగి ప్రభుత్వానికి పంపాలని.. నెలల తరబడి ఖాతాల్లో ఉంచరాదని స్పష్టం చేశారు. రైతుల భూములు తీసుకునే విషయంలో అధికారులు న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలని సూచించారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు మార్కెట్ ధరకు దగ్గరగా పరిహారం అందించాలని చెప్పారు. అవార్డు తర్వాత చెల్లింపుల్లో జాప్యం జరిగితే నిబంధనల మేరకు వడ్డీ చెల్లించాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల కోసం 2026లో రూ.6 వేల కోట్లు అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని మంత్రి గుర్తుచేశారు. ప్రాధాన్య ప్రాజెక్టులు నిధుల కొరతతో ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిధులను సాధారణ బడ్జెట్‌కు అదనంగా సమకూరుస్తున్నట్లు తెలిపారు. కోర్టు కేసులు, యాజమాన్య వివాదాలతో నిలిచిపోయిన భూసేకరణ కేసులను ప్రత్యేకంగా గుర్తించి.. అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. భూసేకరణలో రెండు, మూడు వారాల జాప్యాన్ని సాధారణ పరిపాలనా ప్రక్రియగా చూడొద్దని.. ప్రతి దశకు గడువు నిర్ణయించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
పెండ్లిపాక భూసేకరణపై ప్రత్యేక దృష్టి
నల్గొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, హనుమకొండ తదితర జిల్లాల్లో భూసేకరణ సమస్యలను మంత్రి సమీక్షించారు. నల్గొండ జిల్లాలో చింతపల్లి రిజర్వాయర్, పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టుల భూసేకరణపై ఆరా తీశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయిన నేపథ్యంలో పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సొరంగం పూర్తయినా రిజర్వాయర్‌కు భూములు అందుబాటులో లేకపోతే పెట్టుబడికి తగిన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల ప్రధాన పనులు పూర్తయ్యాయని.. పంపిణీ కాలువలు, అనుసంధాన పనులు, కొద్దిపాటి భూసేకరణ పెండింగ్ కారణంగా వాటి ప్రయోజనాలు రైతులకు అందడం లేదని మంత్రి తెలిపారు. భూసేకరణను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. చెల్లింపులకు సంబంధించిన కేసులు పూర్తిగా సిద్ధమైన తర్వాతే నిధులు కోరాలని కలెక్టర్లకు సూచించారు. విడుదలైన నిధులు ఖాతాల్లో నిరుపయోగంగా ఉండకుండా, ఆర్థిక వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, భూసేకరణ కమిషనర్ శివకుమార్‌నాయుడు, కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం



