Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
Gold Sales | పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశంలో బంగారం నగల డిమాండ్ పుంజుకునే అవకాశముందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. అధిక ధరలు, మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా అత్యవసరం కాని కొనుగోళ్ల విషయంలో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపింది. వ్యాపారులు కూడా డిమాండ్‌పై స్వల్ప ఆశాభావంతో ఉన్నారని వెల్లడించింది.
Gold Sales | పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశంలో బంగారం నగల డిమాండ్ పుంజుకునే అవకాశముందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. అధిక ధరలు, మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా అత్యవసరం కాని కొనుగోళ్ల విషయంలో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపింది. వ్యాపారులు కూడా డిమాండ్‌పై స్వల్ప ఆశాభావంతో ఉన్నారని వెల్లడించింది. ఆగస్టులో దేశీయ బంగారం ధరలు ఏకంగా 12 శాతం పెరిగి గ్రాము రూ.1,58,854కు చేరాయి. దాదాపు మూడు దశాబ్దాల్లో ఇదే అత్యధిక నెలవారీ పెరుగుదల. సెప్టెంబర్‌లో అంతర్జాతీయంగా 3.9 శాతం, దేశీయంగా 4.6 శాతం ధరలు తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానంపై మారుతున్న అంచనాలు, గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి నిధుల ప్రవాహం తగ్గడం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ తెలిపింది.
తేలికపాటి నగల వైపు మొగ్గు
ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ బరువున్న నగలకే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్ద ఆర్గనైజ్డ్ జ్యువెలరీ సంస్థల్లోనూ లైట్‌వెయిట్ నగలకు డిమాండ్ మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త నగలు తీసుకునే లావాదేవీలు పెరగడం వల్ల దేశీయంగా సరఫరా కూడా మెరుగుపడిందని తెలిపింది. డబ్ల్యూజీసీ రీసెర్చ్ హెడ్ కవితా చాకో ప్రకారం.. ఆగస్టు చివర్లో ప్రారంభమైన పండుగ సీజన్‌కు ముందు నగల డిమాండ్ పెరిగినా, ఈ నెల తొలి వారాల్లో కొంత తగ్గింది. పెళ్లి నగల డిమాండ్ మాత్రం ప్రస్తుతం స్థిరంగా ఉంది. ధరల్లో హెచ్చుతగ్గులతో వినియోగదారులు వెనుకడుగు వేస్తుండగా.. రిటైలర్లు కూడా డిమాండ్‌ను బట్టి నిల్వలు పెంచుకోవడంపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. భౌతిక బంగారంపై పెట్టుబడులు స్థిరంగా ఉండగా.. డిజిటల్ గోల్డ్‌పై ఆసక్తి పెరుగుతోంది. జూన్–ఆగస్టు మధ్య నెలకు సగటున రూ.2,500 కోట్ల మేర డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆగస్టులో గతేడాదితో పోలిస్తే కొనుగోళ్లు 110 శాతం పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోనూ పెట్టుబడులు పెరిగాయి. ఆగస్టులో నెలవారీగా 67 శాతం పెరిగి రూ.2,597 కోట్లకు చేరాయి. ఈటీఎఫ్‌లలో బంగారం నిల్వలు 1.6 టన్నులు పెరిగి మొత్తం 121.3 టన్నులకు చేరగా.. నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.1.91 లక్షల కోట్లకు పెరిగింది. అయితే కొత్త పెట్టుబడిదారుల రాక మాత్రం మందగించింది. ఆగస్టులో సుమారు 4,000 కొత్త ఫోలియోలు మాత్రమే నమోదయ్యాయి.
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో జోరు
ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా ఆగస్టులో ఊపందుకుంది. సగటు రోజువారీ టర్నోవర్ 38 శాతం పెరిగి రూ.29,500 కోట్లకు చేరింది. రోజువారీ ట్రేడింగ్ పరిమాణం 27 శాతం పెరిగి 19 టన్నులకు చేరింది. ధరల భారీ ర్యాలీ నేపథ్యంలో హెడ్జింగ్, వ్యూహాత్మక ట్రేడింగ్ పెరగడం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ తెలిపింది. ఆగస్టులో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. నెలవారీగా 45 శాతం, వార్షికంగా 58 శాతం క్షీణించి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతి పరిమాణం 15–20 టన్నుల మధ్యే ఉన్నట్లు అంచనా. దేశీయంగా అందుబాటులో ఉన్న బంగారం సరఫరా డిమాండ్‌ను తీర్చడానికి సరిపోవడంతో దిగుమతులు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా.. ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పండుగలు, పెళ్లిళ్ల సీజన్ బంగారం మార్కెట్‌కు కొంత ఊతమిస్తుందని డబ్ల్యూజీసీ అంచనా వేస్తోంది. అయితే ధరల ఒడిదుడుకులు కొనసాగితే సాధారణ కొనుగోళ్ల కంటే తక్కువ బరువు నగలు, డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్‌ల వైపు కొనుగోలుదారుల మొగ్గు కొనసాగే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
సెప్టెంబర్ 21, 2026

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్



