Bogatha Waterfalls | ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందర్శన నిలిపివేత
Bogatha Waterfalls | తెలంగాణ నయాగరా బొగతా జలపాతం (Bogatha Waterfalls) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో వరద పోటెత్తింది.
Bogatha Waterfalls | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ నయాగరా బొగతా జలపాతం (Bogatha Waterfalls) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో వరద పోటెత్తింది. దీంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు (Temporarily Suspended).
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ప్రకృతి అందాలతో పరవళ్లు తొక్కుతున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పర్యాటకుల సందర్శనను నిలిపేశామని, వరద ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఎవరూ జలపాతం వైపు రావొద్దని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు.
చుట్టూ దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయతతోపాటు కొండలు, గుట్టల నుంచి పారుతున్న వదరతో కనువిందు చేస్తున్న బొగత జలపాతం హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 130 కి.మీ., ఖమ్మం నుంచి 240 కి.మీ., భద్రాచలం నుంచి 120 కి.మీ. దూరంలో ఉన్నది.
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు






