త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sam Altman | ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇంటిపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరిన ఆగంత‌కుడు

Sam Altman | ఓపెన్‌ఏఐ సీఈవో (OpenAI CEO) శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ఇంటిపై దాడి జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని శామ్‌ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్‌ కాక్‌టెయిల్‌ను (Molotov cocktail) విసిరాడు.

D

International | Published On Apr 11, 2026, 12.47 pm IST

Sam Altman | ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇంటిపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరిన ఆగంత‌కుడు
Advertisement

Sam Altman | ఓపెన్‌ఏఐ సీఈవో (OpenAI CEO) శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ఇంటిపై దాడి జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని శామ్‌ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్‌ కాక్‌టెయిల్‌ను (Molotov cocktail) విసిరాడు. దీంతో ఇంటి గేటుకి మంటలు అంటుకున్న‌ట్లు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో 20 ఏళ్ల యువ‌కుడిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శుక్ర‌వారం ఉద‌యం 4:12 గంటల సమయంలో శామ్ అల్ట్‌మ‌న్ ఇంటిని ల‌క్ష్యంగా చేసుకుని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి పెట్రోలు బాంబుతో దాడి చేసిన‌ట్లు చెప్పారు. ఆ ఇంటిపై మండే స్వ‌భావంక‌ల పరిక‌రాన్ని విసిరి అక్క‌డి నుంచి పారిపోయిన‌ట్లు తెలిపారు. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలూ కాలేద‌ని వెల్ల‌డించారు.

ప్ర‌మాద స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంట‌ల‌ను అదుపు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 20 ఏళ్ల యువ‌కుడిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో శామ్ ఆల్ట్‌మ‌న్ ఇంట్లోనే ఉన్నారా..? లేదా..? అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. దాడి వెనుక గ‌ల ఉద్దేశం ఏంటో కూడా తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఓపెన్ ఏఐ ప్ర‌ధాన కార్యాల‌యానికి నిప్పు పెడ‌తామ‌ని బెదిరింపులు వ‌చ్చాయి.

Also Read..

సుబ్బలక్ష్మి వచ్చేసింది... నాని ప్యార‌డైజ్ నుంచి స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్‌

యాదగిరిగుట్ట ఆలయ గొడౌన్‌లో కాజూ ప‌కోడి దందా.. నాలుగేండ్లుగా ట‌న్నుల‌కొద్ది డ్రైఫ్రూట్స్ మాయం

సెల్‌ఫోన్‌లోనే రేప‌టి ఇంట‌ర్ ఫ‌లితాలు: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Advertisement
Advertisement