Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ గొడౌన్‌లో కాజూ పకోడి దందా.. నాలుగేండ్లుగా టన్నులకొద్ది డ్రైఫ్రూట్స్ మాయం
Yadagirigutta | భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి ఆలయం అక్రమాలకు అడ్డాగా మారింది. ఆలయ సిబ్బంది స్వామివారి సొమ్మును నిలువునా దోచుకుంటున్నారు.
Yadagirigutta | త్రినేత్ర.న్యూస్: భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి ఆలయం అక్రమాలకు అడ్డాగా మారింది. ఆలయ సిబ్బంది స్వామివారి సొమ్మును నిలువునా దోచుకుంటున్నారు. ప్రసాదం కోసం నిల్వ ఉంచిన చింతపండు, డ్రైఫూట్స్ (Dry Fruits) మాయం చేస్తున్నారు. ఇప్పటికే చింతపండును దొంగిలించి వార్తల్లో నిలిచిన ఆలయ సిబ్బంది.. తాజాగా ఏకంగా గోదాంలోనే ప్రసాద తయారీకి ఉపయోగించే జీడిపప్పుతో పకోడీలు చేసి (Cashew Pakoda), వాటిని ఆలయ ప్రసాద కవర్లలో ప్యాకింగ్ చేసి షాపులకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఇలా టన్నుల కొద్ది కాజు, కిస్‌మిస్ వంటి విలువైన డ్రైఫ్రూట్స్‌ను మాయం చేస్తున్నారు. గత నాలుగేండ్లుగా క్వింటాళ్ల కొద్ది డ్రైఫూట్స్ మాయమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జీడిపప్పును సిబ్బంది తమ ఇండ్లుకు పంపించుకోవడమే కాకుండా, బయట షాపులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ప్రసాద తయారీకి వచ్చే బియ్యం, పప్పులు, నూనె కూడా భారీగా పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






