OpenAI | ఓపెన్ఏఐ కొత్త చిప్ జలపెనో.. చాట్ జీపీటీ సేవలు మరింత వేగవంతం..
OpenAI | ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఓపెన్ ఏఐ తాను సొంతంగా రూపొందించిన ఏఐ చిప్ జలపెనోను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ చిప్‌ను సెమీకండక్టర్ దిగ్గజం బ్రాడ్‌కామ్ తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేసింది.
Technology | Published On Jun 27, 2026, 2.23 pm IST
OpenAI | ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఓపెన్ ఏఐ తాను సొంతంగా రూపొందించిన ఏఐ చిప్ జలపెనోను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ చిప్‌ను సెమీకండక్టర్ దిగ్గజం బ్రాడ్‌కామ్ తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా చాట్‌జీపీటీ, కోడెక్స్, ఏపీఐ సేవలు, అలాగే భవిష్యత్‌లో రానున్న ఏజెంటిక్ ఏఐ ఉత్పత్తులకు అవసరమైన ఎల్‌ఎల్‌ఎమ్ ఇన్‌ఫరెన్స్ వర్క్‌లోడ్స్ కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ఓపెన్ఏఐ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. తాము తమ తొలి ఏఐ చిప్ జలపెనోను రూపొందించి తయారు చేశామని, దీన్ని పూర్తిగా ఓపెన్‌ఏఐ రూపకల్పనలో అభివృద్ధి చేశామని తెలిపింది. బ్రాడ్‌కామ్‌తో కలిసి ఉత్పత్తి దశకు తీసుకువచ్చామని, చాట్‌జీపీటీ, కోడెక్స్, ఏపీఐ, భవిష్యత్ ఏజెంటిక్ ఉత్పత్తులకు శక్తినిచ్చే ఎల్‌ఎల్‌ఎమ్ వర్క్‌లోడ్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చిప్‌ను తయారు చేశామని పేర్కొంది.
భౌతిక నమూనా ఆవిష్కరణ..
అలాగే ఏఐ ఆర్థిక వ్యవస్థకు చిప్స్ అత్యంత కీలకమని, సొంతంగా చిప్‌లను అభివృద్ధి చేయడం ద్వారా తమ ఫుల్‌స్టాక్ ప్లాట్‌ఫామ్‌ను ఉత్పత్తులు, మోడల్స్ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు విస్తరించగలుగుతున్నామని తెలియజేసింది. దీని వల్ల మరింత మందికి ఏఐ సేవలను అందించడంతోపాటు మేధస్సు సామర్థ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ చిప్‌కు చెందిన తొలి భౌతిక నమూనాను బ్రాడ్‌కామ్ ప్రెసిడెంట్, సీఈఓ హాక్ టాన్, ప్రెసిడెంట్ చార్లీ కవ్వాస్, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ కు అందజేశారు. జలపెనో చిప్‌ను ఎల్‌ఎల్‌ఎమ్‌ల ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా కొత్తగా రూపొందించారు. కంపెనీ భవిష్యత్ మోడల్స్, కర్నెల్స్, సర్వింగ్ సిస్టమ్స్, ఉత్పత్తుల అవసరాలను ఆధారంగా చేసుకుని దీని డిజైన్ ను రూపొందించగా, బ్రాడ్‌కామ్‌తోపాటు సెలెస్టికా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉత్పత్తి స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి.
ల్యాబ్‌లలో టెస్టింగ్..
ప్రస్తుతం జలపెనో ఇంజినీరింగ్ శాంపిల్స్ ఇప్పటికే ప్రయోగశాలలో ప్రొడక్షన్ లక్ష్య ఫ్రీక్వెన్సీ, పవర్ స్థాయిల వద్ద మెషిన్ లెర్నింగ్ వర్క్‌లోడ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో జీపీటీ-5.3-కోడెక్స్-స్పార్క్ కూడా నడుస్తోందని కంపెనీ తెలిపింది. అయితే తుది పనితీరు అంచనాలను ఇంకా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ప్రాథమిక పరీక్షల్లో ఈ చిప్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యాధునిక ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పర్ వాట్‌కు గణనీయంగా మెరుగైన పనితీరును అందిస్తున్నట్లు సంకేతాలు లభించాయని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. పూర్తి సాంకేతిక నివేదికను రాబోయే నెలల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
సంబంధిత వార్తలు

Oracle layoffs | ఏఐ ఎఫెక్ట్.. 12 నెలల్లో 21,000 మందిని తొలగించిన ఒరాకిల్.. భవిష్యత్తులో మరిన్ని కోతలు
జూన్ 23, 2026

ChatGPT | చాట్‌జీపీటీ ధరలు భారీగా తగ్గనున్నాయా? ఏఐ పోటీలో ఓపెన్ఏఐ కొత్త వ్యూహం..
జూన్ 13, 2026

ChatGPT | చాట్‌జీపీటీలో కొత్త ఫైనాన్స్ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్లు కనెక్ట్ చేసుకునే అవకాశం..
మే 22, 2026
తాజావార్తలు
- ●Pattaya Suitcase Murder | బ్యాంకాక్‌లో ఆస్ట్రేలియా టూరిస్ట్ కిరాతకం: 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కి
- ●Rammohan Reddy | రాముడి ఒంటి మీది సొమ్ములు కూడా అమ్ముకున్నరు
- ●Leopard | అది చిరుత కాదు.. కుక్క అయి ఉండొచ్చు
- ●Trisha - Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా - ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి
- ●ITR | షేర్ మార్కెట్లో నష్టం వచ్చినా ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సిందేనా..?
- ●KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు అనిపిస్తోంది : కేటీఆర్

Pattaya Suitcase Murder | బ్యాంకాక్‌లో ఆస్ట్రేలియా టూరిస్ట్ కిరాతకం: 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కి

Rammohan Reddy | రాముడి ఒంటి మీది సొమ్ములు కూడా అమ్ముకున్నరు

Leopard | అది చిరుత కాదు.. కుక్క అయి ఉండొచ్చు

Trisha - Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా - ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి



