త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | సుబ్బలక్ష్మి వచ్చేసింది… నాని ప్యార‌డైజ్ నుంచి స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్‌

నాని ప్యార‌డైజ్ మూవీ నుంచి శ‌నివారం స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సుబ్బ‌ల‌క్ష్మి పాత్ర‌లో క‌య‌దు లోహ‌ర్ క‌నిపించ‌బోతున్న‌ది.

N

News | Published On Apr 11, 2026, 12.45 pm IST

Kayadu Lohar | సుబ్బలక్ష్మి వచ్చేసింది… నాని ప్యార‌డైజ్ నుంచి స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్‌
Advertisement

Kayadu Lohar | నాని హీరోగా న‌టిస్తోన్న ప్యార‌డైజ్ మూవీ షూటింగ్ మొద‌లై ఏడాది దాటిపోయింది. మ‌రో నాలుగు నెల‌ల్లో సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది అఫీషియ‌ల్‌గా మేక‌ర్స్ క‌న్ఫామ్ చేయ‌లేదు. హీరోయిన్ విష‌యంలో ఇన్నాళ్లు స‌స్పెన్స్ మెయింటేన్ చేసిన ప్యార‌డైజ్ మేక‌ర్స్ శ‌నివారం ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్‌ అప్‌డేట్ అందించారు.

సుబ్బ‌ల‌క్ష్మిగా...

ప్యార‌డైజ్ మూవీలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ప్యార‌డైజ్ సినిమాలో సుబ్బు అలియాస్ సుబ్బ‌ల‌క్ష్మి పాత్ర‌లో క‌య‌దు లోహ‌ర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. వెండితెర‌పై వెల‌గ‌ని తార అంటూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు జోడించిన‌ క్యాప్ష‌న్‌ను ఆస‌క్తిని పంచుతోంది. స్ల‌మ్ ఏరియాలోని మ‌ట్టి రోడ్‌పై సైకిల్ తొక్కుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌య‌దు లోహ‌ర్ క‌నిపిస్తోంది. క్యాప్ పెట్టుకొని....సైకిల్ ముంద‌ర లెద‌ర్ బ్యాగ్‌తో కంప్లీట్ రెట్రో లుక్‌లో క‌య‌దు లోహ‌ర్ పోస్ట‌ర్ డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. క‌య‌దు లోహ‌ర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ద‌స‌రా త‌ర్వాత‌....

పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ప్యార‌డైజ్ మూవీకి శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. ఇందులో జ‌డ‌ల్ అనే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నాని న‌టిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అత‌డి మేకోవ‌ర్ అయిన తీరు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అనిరుధ్ మ్యూజిక్‌...

ప్యార‌డైజ్‌లో సీనియ‌ర్ హీరో మోహ‌న్‌బాబు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. బాలీవుడ్ న‌టుడు రాఘ‌వ్ జుయ‌ల్‌, సంపూర్ణేష్‌బాబుతో పాలు ప‌లు భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ప్యార‌డైజ్ మూవీకి కోలీవుడ్ సెన్సేష‌న్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

రూమ‌ర్ల‌కు చెక్‌...

ప్యార‌డైజ్ మ‌రోసారి పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్‌, ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో ఆగ‌స్ట్ 21కి వాయిదాప‌డింది. తాజాగా ఆగ‌స్ట్ నుంచి డిసెంబ‌ర్‌కు ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారంటూ గ‌త కొన్నాళ్లుగా వార్త‌లొస్తున్నాయి. క‌య‌దు లోహ‌ర్ ఫ‌స్ట్ లుక్‌తో ఈ రూమ‌ర్ల‌కు మేక‌ర్స్ చెక్ పెట్టారు. ఆగ‌స్ట్ 21నే ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఫుల్ బిజీ....

ఇటీవ‌లే విశ్వ‌క్‌సేన్ ఫంకీ మూవీలో హీరోయిన్‌గా న‌టించింది క‌య‌దు లోహ‌ర్‌. జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగులో ప్యార‌డైజ్‌తో పాటు త‌మిళం, మ‌ల‌యాళంలో మ‌రో ఆరు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది క‌య‌దు లోహ‌ర్‌.

 

Advertisement
Advertisement