త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Results on WhatsApp | వాట్సాప్‌లోనే రేప‌టి ఇంట‌ర్ ఫ‌లితాలు: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Inter Result | స‌మాచార‌, సాంకేతిక విప్ల‌వంలో తెలంగాణ మీసేవ(Mee Seva) ముందంజ‌లో ఉంద‌ని, తాజాగా సేవ‌లు విస్త‌రించ‌డంతో రేప‌టి ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సెల్‌ఫోన్‌లోనే చూసుకోవ‌చ్చ‌ని ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. మీసేవ కేవ‌లం సౌక‌ర్యం కాద‌ని.. ప్లాట్‌ఫామ్ ద్వారా ప్ర‌భుత్వం ప్ర‌తి పౌరుడిని చేరుకోవ‌డం అని మంత్రి పేర్కొన్నారు.

S

News | Published On Apr 11, 2026, 12.33 pm IST

Inter Results on WhatsApp | వాట్సాప్‌లోనే రేప‌టి ఇంట‌ర్ ఫ‌లితాలు: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: స‌మాచార‌, సాంకేతిక విప్ల‌వంలో తెలంగాణ మీసేవ(Mee Seva) ముందంజ‌లో ఉంద‌ని, తాజాగా సేవ‌లు విస్త‌రించ‌డంతో రేప‌టి ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సెల్‌ఫోన్‌లోనే చూసుకోవ‌చ్చ‌ని ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులు రేప‌టి నుంచి వాట్సాప్ (WhatsApp)లో తమ బోర్డ్ పరీక్ష ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌న్నారు. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 580 రకాల మీసేవ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివ‌రించారు. మీసేవ కేవ‌లం సౌక‌ర్యం కాద‌ని.. ప్లాట్‌ఫామ్ ద్వారా ప్ర‌భుత్వం ప్ర‌తి పౌరుడిని చేరుకోవ‌డం అని మంత్రి పేర్కొన్నారు.

దూరదృష్టితో మీసేవ WhatsApp/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌ను గ‌తేడాది న‌వంబ‌ర్‌ 18న ప్రారంభించిన‌ట్లు మంత్రి గుర్తు చేశారు. అన‌తికాలంలోనే 580కి పైగా ప్రభుత్వ సేవలను అందించే స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్రంలో అత్యంత వేగంగా స్వీకరించిన డిజిటల్ పౌర సేవా చాన‌ళ్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. 80969 58096కు వాట్సాప్‌ సందేశం పంపడం ద్వారా అన్ని సేవలు యాక్సెస్ అవుతాయ‌ని చెప్పారు. పోర్టల్ లాగిన్ లేకుండా ఇప్ప‌టికే లక్షల‌ మంది విద్యార్థులకు ఇంటర్‌, ప‌దో త‌ర‌గ‌తి హాల్ టికెట్లు ఉచితంగా అందించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇంట‌ర్‌ ఫలితాల‌ డౌన్‌లోడ్ ఎలా అంటే..

  • 80969 58096ను మీ కాంటాక్ట్‌లో "Mee Seva Telangana"గా సేవ్ చేయాలి
  • వాట్సాప్‌ తెరిచి "Hi" అని పంపగానే మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది
  • "BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కాలి
  • మీ రూల్ నంబర్ నమోదు చేసి సంవత్సరం (1వ / 2వ), స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకొని స‌బ్‌మిట్ చేయ‌గానే ఫలితం తక్షణమే వాట్సాప్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

 

Advertisement
Advertisement