త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Benjamin Netanyahu | నేను చ‌నిపోయా.. మ‌ర‌ణ వార్త‌ల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు

Benjamin Netanyahu | ఇరాన్ దాడుల్లో తాను చ‌నిపోయానంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి (Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్వ‌యంగా స్పందించారు. తాను చ‌నిపోలేద‌ని.. బ‌తికే ఉన్నానంటూ ఎక్స్ వేదిక‌గా ఓ వీడియో రిలీజ్ చేశారు.

D

International | Published On Mar 16, 2026, 9.58 am IST

Benjamin Netanyahu | నేను చ‌నిపోయా.. మ‌ర‌ణ వార్త‌ల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు
Advertisement

Benjamin Netanyahu | ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి (Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) చ‌నిపోయారంటూ గ‌త కొన్నిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌ను టెల్ అవీవ్ ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూ వ‌స్తోంది. అయినా, నెత‌న్యాహు ఈజ్ డెడ్ వార్త‌లు మాత్రం ఆగడం లేదు. ఈ నేప‌థ్యంలో తాను చ‌నిపోయానంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఇజ్రాయెల్ ప్ర‌ధాని స్వ‌యంగా స్పందించారు. తాను చ‌నిపోలేద‌ని.. బ‌తికే ఉన్నానంటూ ఎక్స్ వేదిక‌గా ఓ వీడియో రిలీజ్ చేశారు.

కాఫీ కోసం చ‌నిపోయా..

నెత‌న్యాహు ఓ కేఫ్ వ‌ద్ద కాఫీ తాగుతున్న వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా తాను మ‌ర‌ణించానంటూ వ‌స్తున్న పుకార్ల‌పై స్పందించారు. "నేను చ‌నిపోయా.. కాఫీ కోసం" (I am dead… for coffee) అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. త‌న ప్ర‌జ‌ల కోసం ప్రాణాలివ్వ‌డానికైనా తాను సిద్ధ‌మే అంటూ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ చేసిన దాడిలో నెత‌న్యాహు చనిపోవడంతో.. ఇజ్రాయెల్ ఆయన‌కు సంబంధించిన ఏఐ వీడియో రిలీజ్ చేసిందని అందులో చేతికి 6 వేళ్లు ఉన్నాయంటూ సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ప్ర‌చారంపై కూడా ఇజ్రాయెల్ ప్ర‌ధాని స్పందించారు. "మీరు నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా..? ఇక్కడ చూడండి.. చూశారా..? చాలా బాగున్నాయి కదూ" అంటూ వ్యాఖ్యానించారు.

స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోండి..

ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ పౌరుల‌కు నెత‌న్యాహు ఓ కీల‌క సందేశం ఇచ్చారు. బ‌య‌ట‌కు వెళ్లి కాస్త స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోండి అంటూ సూచించారు. అదేసమయంలో సురక్షిత ప్రదేశాలకు సమీపంలేనే ఉండాలని.. హోం ఫ్రంట్‌ కమాండ్‌ ఆదేశాలను తూచాతప్పకుండా పాటించాలని సూచించారు. మీ మద్దతు నాకు, ప్రభుత్వానికి, ఐడిఎఫ్‌కు, మొసాద్‌కు బలాన్ని ఇస్తుంది అంటూ పేర్కొన్నారు.

నెతన్యాహును వదిలిపెట్టం, వేటాడి చంపుతాం..

అంతకు ముందు ఇజ్రాయెల్ ప్ర‌ధానిని వ‌దిలిపెట్ట‌మంటూ ఇరాన్ తీవ్ర హెచ్చురిక‌లు చేసిన విష‌యం తెలిసిందే. 'పిల్లల హంతకుడు' అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును (Benjamin Netanyahu) హతమారుస్తామని ఇరాన్ ప్రతినబూనింది. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రధాని "ఇంకా బతికే ఉంటే", ఆయన్ను ఎక్కడున్నా వేటాడి, పూర్తి బలగాలతో దాడి చేసి చంపుతామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసింది.

https://x.com/netanyahu/status/2033190035764232360

Also Read..

Oscar Awards | ఆస్కార్ అవార్డులు.. ఉత్త‌మ చిత్రం ఇదే..

Fire Accident | ఐసీయూలో అగ్నిప్ర‌మాదం.. 10 మంది రోగులు మృతి

Assembly Budget Session | నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు..

Advertisement
Advertisement