Oscar Awards | ఆస్కార్ అవార్డులు.. ఉత్తమ చిత్రం ఇదే..
Oscar Awards | సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ దీనికి వేదికగా మారింది.
Entertainment | Published On Mar 16, 2026, 9.22 am IST
Oscar Awards | త్రినేత్ర.న్యూస్: సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ దీనికి వేదికగా మారింది. ప్రతి ఏడాది 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టడంతో ఆ సంఖ్య 24కు పెరిగింది.

98వ ఆస్కార్ అవార్డుల కోసం 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ (Connan O'Brien) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వివిధ విభాగాల్లో అత్యధిక నామినేషన్లు పొందిన సిన్నర్ (Sinners), టైటానిక్ హీరో లియోనార్డో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another) చిత్రాలకు అవార్డుల పంట పండింది. వన్ బ్యాటిల్ మూవీకి ఆరు అవార్డులు రాగా, 16 విభాగాల్లో నామినేట్ అయిన సిన్నర్స్ సినిమాకు 4 అవార్డులు దక్కాయి. ఇక ఫ్రాంకెన్‌స్టీన్ చిత్రానికి మూడు ఆస్కార్‌లు దక్కాయి. ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళగా ఆటమ్ డురాల్డ్ అరపా (Autumn Durald Arkapaw) నిలిచారు.

ఆస్కార్ విజేతల జాబితా..
- ఉత్తమ చిత్రం- వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఉత్తమ దర్శకుడు- పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ నటుడు- మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)
- ఉత్తమ నటి- జెస్సీ బక్లీ (హామ్నెట్)
- ఉత్తమ సహాయ నటుడు- సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ సహాయ నటి- ఎమీ మాడిగన్ (వెపన్స్)
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- సెంటిమెంటల్ వ్యాల్యూ
- బెస్ట్ సినిమాటోగ్రఫి- ఆటం డ్యూరాల్డ్ అర్కాపా (సిన్నర్స్)
- ఉత్తమ ఎడిటింగ్- ఆండీ జుర్గెన్‌సెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్)
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- కేపాప్ డిమాన్ హంటర్స్
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- ఫ్రాంకిన్ స్టన్
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌చేంజింగ్ సలైవా
- ఉత్తమ సంగీతం- లుడ్విన్ గోరాన్సన్ (సిన్నర్స్)
- ఉత్తమ సౌండ్- గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఏ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)
- ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం- మిస్టర్ నోబడీ ఎగైన్‌స్ట్ పుతిన్
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలి- ఆల్ ద ఎంప్టీ రూమ్
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్)
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే- ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్- మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్)
సంబంధిత వార్తలు

Oscars 2026 | రూ. 318 కోట్ల డైమండ్ నక్లెస్‌తో హాలీవుడ్ హీరోయిన్ ర్యాంప్ వాక్ – ఆస్కార్ చరిత్రలోనే రికార్డ్
మార్చి 16, 2026

Oscars 2026 | అట్టహాసంగా ఆస్కార్ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా దేశీ గర్ల్స్ ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ
మార్చి 16, 2026

Oscar Awards | ఆస్కార్‌లో సత్తాచాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఆరు విభాగాల్లో అవార్డుల పంట
మార్చి 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



