Fire Accident | ఐసీయూలో అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి
Fire Accident | ఒడిశా కటక్‌లోని (Cuttack) ప్రభుత్వ దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (SCB medical college) ట్రామా కేర్ ఐసీయూలో (trauma care ICU) సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర.న్యూస్: ఒడిశా కటక్‌లోని (Cuttack) ప్రభుత్వ దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (SCB medical college) ట్రామా కేర్ ఐసీయూలో (trauma care ICU) సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో 10 మంది రోగుల మరణించగా, మరో 11 మంది హాస్పిటల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో హాస్పిటల్ మొదటి అంతస్తులోని ట్రామా కేర్ యూనిట్‌లో మంటలు అంటుకున్నాయని చెప్పారు. ఆ సమయంలో వార్డులో మొత్తం 23 మంది చికిత్స పొందుతున్నారని, మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది, వైద్యులు సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. రోగులను ఇతర ఐసీయూ, జనరల్ వార్డులకు తరలించే సమయంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే మరో ముగ్గురు మృతిచెందారన్నారు. క్షతగాత్రుల్లో ఐదుగురు రోగులు, ఇద్దరు హాస్పిటల్ సిబ్బంది ఉన్నారన్నారు.
క్షణాల్లోనే పొగ హాస్పిటల్ మొత్తానికి వ్యాపించడంతో రోజులు, వారి సహాయకులు భయాందోళనలకు గురయ్యారని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐసీయూలోని ఏసీ లేదా వైద్య పరికరాల్లో షార్ట్ సర్య్కూట్ కావడంతోనే మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్యశాఖ మంత్రి మహాలింగ్ దవాఖానకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
https://x.com/ANI/status/2033357594031690235
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






