Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..
Israel Elections | సార్వత్రిక ఎన్నికల్లో (Israel Elections) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి (Benjamin Netanyahu) ఇజ్రాయెల్ ప్రజలు షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని కూటమికి ఆధిక్యం కట్టబెట్టినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్జీ ఇవ్వలేదు.
International | Published On Oct 30, 2026, 8.16 am IST
Israel Elections | త్రినేత్ర న్యూస్: సార్వత్రిక ఎన్నికల్లో (Israel Elections) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి (Benjamin Netanyahu) ఇజ్రాయెల్ ప్రజలు షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని కూటమికి ఆధిక్యం కట్టబెట్టినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్జీ ఇవ్వలేదు. ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ (majority) రాకపోవడంతో హంగ్ తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీలు కింగ్ మేకర్లుగా మారాయి. దీంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న నెతన్యాహుకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఈ నెల 27న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన తుది ఫలితాల ప్రకారం నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి కేవలం 53 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందులో 27 స్థానాలతో లికుడ్ పార్టీ (Likud Party) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన ప్రతిపక్ష నేత గాది ఐసెన్‌కోట్ (Gadi Eisenkot) నేతృత్వంలోని కూటమి 48 స్థానాలకే పరిమితమైంది. అరబ్ పార్టీల (Arab Parties) కూటమి రికార్డు స్థాయిలో 19 స్థానాలను గెలుచుకుని తుది ఫలితాన్ని శాసించే స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ పార్లమెంటులో (నెస్సెట్) మొత్తం 120 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయిన 61 సీట్లు. 53 స్థానాల్లో గెలుపొందిన నెతన్యాహు కూటమి మరో 8 స్థానాల దూరంలో నిలిచింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు తప్పనిసరి అయింది.
అయితే అరబ్ స్థానాలపై విదేశీ జోక్యం, అక్రమాలు జరిగాయంటూ లిక్‌డ్ పార్టీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెతన్యాహు కూటమితో అరబ్ పార్టీలు (Arab-led Parties) జట్టు కడతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నెతన్యాహుని అధికారినికి దూరం చేయాలనే వ్యూహంతో విపక్ష కూటమి పావులు కదుపుతున్నది. అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు జరుపుతున్నది. అయితే ఏ కూటమీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పక్షంలో మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. కాగా, దేశంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు నెతన్యాహు ప్రధానిగా కొనసాగనున్నారు.
సంబంధిత వార్తలు

Yuval Blumberg | ట్రంప్ ఉన్న ఈ రెండేళ్లలోనే ఇరాన్ పని పూర్తి చేయాలి.. లేదంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు
అక్టోబర్ 25, 2026

Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
అక్టోబర్ 19, 2026

Smit Machchhar | యావత్ ప్రపంచానికే నువ్వు హీరోవి : స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించిన నెతన్యాహు
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక
- ●Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..
- ●TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు
- ●SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు
- ●Horoscope | అక్టోబర్ 30 రాశిఫలాలు.. ప్రేమ వ్యవహారాలు చాలా రొమాంటిక్‌గా ఉంటాయి!
- ●Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద రాత్రిళ్లు భారీ బ్లాస్టింగ్లు.. హరీశ్ రావు ఫైర్!

Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక

Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..

TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు

SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు



