Assembly Budget Session | నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
Assembly Budget Session | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. ఇందులో సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు.
మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం చర్చను ప్రతిపాదించనుంది. మంగళ, బుధవారాల్లో చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఈనెల 20న ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చించనున్నారు.
కాగా, ఈ నెల 19న ఉగాది పండుగ కావడంతో సభ జరుగదు. మళ్లీ 20న ఉభయ సభలు సమావేశం కానుండగా, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతి రోజు (మార్చి 21న) రంజాన్ కావడంతో మళ్లీ 23న సభ ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. మార్చి 30 లేదా 31న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
తొలిసారి ఒకే ప్రాంగణంలో..
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తొలిసారిగా ఒకే ప్రాంగణంలో కొలువు దీరనున్నాయి. మండలి సమావేశాలు ఇప్పటివరకు జూబ్లీహాల్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచి పునరుద్ధరించిన పాత అసెంబ్లీ భవనంలో జరగనున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



