Assembly Budget Session | మూడో రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. నేడు శాసన సభలో మూసీ పునరుజ్జీవంపై చర్చ
Assembly Budget Session | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) వాడివేడిగా సాగుతున్నాయి. అధికార విపక్షాల సభ్యుల మధ్య వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉభయ సభలు నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన సమావేశాలు.. మూడో రోజుకు చేరాయి.
Assembly Budget Session | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) వాడివేడిగా సాగుతున్నాయి. అధికార విపక్షాల సభ్యుల మధ్య వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉభయ సభలు నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన సమావేశాలు.. మూడో రోజుకు చేరాయి. బుధవారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు షురూ కానున్నాయి. గిడ్డంగుల కార్పొరేషన్‌కు సంబంధించి వార్షిక నివేదికను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాదేశ్వరరావు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. శాసన సభలో గిడ్డంగుల కార్పొరేషన్ సంబంధించి 2019-20 ఆర్థిక ఏడాది వార్షిక నివేదికపై చర్చింనున్నారు. మూసీ పునరుజ్జీవంపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీపై ప్రభుత్వం చర్చను చేపట్టనుంది. దీనిపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చే అవకాశం ఉన్నది.
ఇక శాసన మండలిలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై సభ్యులు విజయ శాంతి, అద్దంకి దయాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, వరంగల్‌లో పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ఎరువులపై రవాణా చార్జీలు, ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, గత రబీ పంటకు బోనస్ చెల్లింపు, జీహెచ్ఎంసీ పరిధిలో బస్ షెల్టర్ల నిర్మాణం, భీమలింగం కాలువ పనులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయంపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇస్తారు.
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?





