Mojtaba Khamenei | ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ..
Mojtaba Khamenei | ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో (Iran) కీలక పరిణామం చోటుచేసుకున్నది. అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతితో ఆ దేశ తదుపరి సుప్రీం లీడర్ (Supreme Leader) ఎంపిక పూర్తయింది.
International | Published On Mar 9, 2026, 8.07 am IST
Mojtaba Khamenei | త్రినేత్ర.న్యూస్: ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో (Iran) కీలక పరిణామం చోటుచేసుకున్నది. అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతితో ఆ దేశ తదుపరి సుప్రీం లీడర్ (Supreme Leader) ఎంపిక పూర్తయింది. ఇరాన్ సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించింది. గత నెల 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (Assembly of Experts) కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన చిన్న కుమారుడు మొజ్తబాను ఎన్నుకున్నది. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.
ఎవరీ మొజ్తబా..
మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా కుమారుల్లో ఒకరైన 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ 1969లో మషహద్‌లో జన్మించారు. ఆయనకు గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం లేదు. కానీ షియా మత ప్రబోధకుడిగా మొజ్తబాకు పేరుంది. మతపరమైన వాతావరణంలో విద్యనభ్యసించిన మొజ్తబా.. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో రివల్యూషనరీ గార్డ్స్‌తో కలిసి పనిచేశారు. ఆయన చాలా కాలం నుంచి తన తండ్రికి పరిపాలనలో సలహాలు ఇచ్చేవారని, తెర వెనుక ఉండి అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రచారంలో ఉంది. ఇప్పటివరకూ ఎటువంటి పెద్ద ప్రభుత్వ పదవిని చేపట్టనప్పటికీ, సైన్యంతో పాటు పారా మిలిటరీ బలగాలతో మొజ్తబాకు మంచి సంబంధాలు ఉన్నాయి.
2009లో తెరపైకి..
2006లో ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో మొజ్తబా పేరు చర్చలోకి వచ్చింది. నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరిస్తారని దేశంలో రాజకీయ చర్చ మొదలైంది. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం సమయంలో వంశపారంపర్యంగా అధికారాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అందువల్ల, ఆయన ఎంపికపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఖమేనీ కుమారుడికి సుప్రీం లీడర్ పదవిని అప్పగిస్తే, మతపెద్దల కమిటీపై ప్రజల్లో ఆగ్రహం పెరగొచ్చనే అంచనాలున్నాయి. ఖమేనీ కుటుంబ వారసత్వాన్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తే, ఇరాన్‌లోకి మళ్లీ రాచరికాన్ని తెచ్చినట్టు అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా పేర్కొంటున్నారు.
సుప్రీం లీడర్ పదవి ఎంత ముఖ్యమైనది?
ఇరాన్‌లో సుప్రీం లీడర్ అనేది దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవి. సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియా, విదేశీ విధానంతో పాటు ప్రధాన వ్యూహాత్మక నిర్ణయాలపై తుది అధికారం సుప్రీం లీడర్‌కు ఉంటుంది. అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నడిపిస్తారు, కానీ తుది నియంత్రణ సుప్రీం లీడర్ వద్దే ఉంటుంది. అందువల్ల సుప్రీం లీడర్ మరణిస్తే, అధికార మార్పిడి ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.
మొజ్తబాకు గాయం..
ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మొజబా గాయపడినట్లు తెలుస్తున్నది. ఫిబ్రవరి 28 నాటి ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో మొజ్తబా కూడా ఉన్నట్టు కతనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి.
ఇవికూడా చదవండి..
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కూడా మా టార్గెటే : ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే క్యాచులు.. మీరూ చూసేయండి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






