Irans Supreme Leader | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కూడా మా టార్గెటే : ఇజ్రాయెల్ హెచ్చరిక
Irans Supreme Leader | ఇరాన్‌కు ఇజ్రాయెల్ (Israel) తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా (Irans Supreme Leader) ఎవరు ఎన్నికైనా వారు కూడా తమ హిట్‌లిస్ట్‌లో ఉంటారని హెచ్చరించింది.
International | Published On Mar 4, 2026, 1.57 pm IST
Irans Supreme Leader | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరింది. ఇవాళ కూడా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్, లెబనాన్ రాజధానులపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అదేసమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ (Israel) తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా (Irans Supreme Leader) ఎవరు ఎన్నికైనా వారు కూడా తమ హిట్‌లిస్ట్‌లో ఉంటారని హెచ్చరించింది. కొత్తగా ఎన్నికయ్యేది ఎవరైనా సరే అతన్ని కూడా అంతం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికాను నాశనం చేసే ప్రణాళికను కొనసాగించినా.. ప్రాంతీయ దేశాలను భయపెట్టాలని చూసినా, ఇరాన్ ప్రజలను హింసించినా తాము చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. అక్కడ ఉన్నది ఎవరైనా సరే అంతం చేస్తామని వెల్లడించారు. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత తదుపరి వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొన్న వేళ ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలు మరింత ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ..!
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei)ని ఎంపిక చేసినట్లు సమాచారం. 88 మంది సభ్యులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' (Assembly of Experts) కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన కుమారుల్లో ఒకరైన మొజ్తబాను ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఇరాన్ ఇంర్నేషనల్ వెల్లడించింది. మొజ్తబా ఎంపిక వెనుక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రభావం ఉన్నట్లు సమాచారం. తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తబాను ఎంపికచేయాలని మతపరమైన వ్యక్తులతో నిండి ఉన్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌పై ఐఆర్‌జీసీ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొంది.
Also Read..
Iran-Israel War | 11 అణుబాంబుల తయారీ.. అందుకనే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం..?
సంబంధిత వార్తలు

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త ‘సుప్రీం లీడర్’ దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
జులై 5, 2026

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
జులై 4, 2026

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
- ●Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల



