త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Reward | ఇరాన్ అణు ర‌హ‌స్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్‌.. అమెరికా భారీ ఆఫ‌ర్‌

US Reward | ఇరాన్ అణు కార్య‌క్ర‌మానికి (Nuclear Programme) సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని అందించేవారికి అమెరికా బంప‌ర్ ఆఫ‌ర్ (US Reward) ప్ర‌క‌టించింది. ఆ దేశానికి సంబంధించిన అణు ర‌హ‌స్యాలు చెప్పిన‌వారికి 2 మిలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ.166 కోట్లు) భారీ న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తామ‌ని అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ వెల్ల‌డించింది.

G

International | Published On Nov 7, 2026, 11.34 am IST

US Reward | ఇరాన్ అణు ర‌హ‌స్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్‌.. అమెరికా భారీ ఆఫ‌ర్‌
Advertisement

US Reward | త్రినేత్ర న్యూస్‌: ఇరాన్ అణు కార్య‌క్ర‌మానికి (Nuclear Programme) సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని అందించేవారికి అమెరికా బంప‌ర్ ఆఫ‌ర్ (US Reward) ప్ర‌క‌టించింది. ఆ దేశానికి సంబంధించిన అణు ర‌హ‌స్యాలు చెప్పిన‌వారికి 2 మిలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ.166 కోట్లు) భారీ న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తామ‌ని అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ (US Central Command) వెల్ల‌డించింది. అదేవిధంగా స‌మాచారం ఇచ్చిన వారికి పున‌రావాన్ని (Relocation) క‌ల్పిస్తామ‌ని తెలిపింది.

ఇరాన్ (Iran) అణు కేంద్రాలు, అక్క‌డ ఉప‌యోగించే కీల‌క పరికరాలు, వాటి తరలింపు వివరాలు, ఆయా ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి సంబంధించిన క‌చ్చిత‌మైన‌ సమాచారాన్ని అందించాలని కోరింది. ఈ సమాచారాన్ని పంపాలనుకునే వారు 'సిగ్నల్' (Signal) లేదా 'టోర్' (Tor) ఆధారిత సురక్షితమైన డిజిటల్ ఛానెల్‌ల ద్వారా అత్యంత రహస్యంగా అమెరికాకు చేరవేయవచ్చని తెలిపింది. పికాక్స్ మౌంటెన్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం.

అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇరాన్ రహస్యంగా అణు పరికరాల ఉత్పత్తి, నిల్వలను పెంచుతున్న‌దని అమెరికా ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన అత్యంత రహస్య భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న 'పికాక్స్ మౌంటెన్'పై (Pickaxe Mountain) సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన విష‌యం తెలిసిందే. టెహ్రాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అమెరికా ముందు ఒకటి లేదా రెండు లక్ష్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. గత ఎనిమిది నెలల ఘర్షణతో ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు ఒప్పందం కోసం ఆరాటపడుతున్న‌దని వెల్ల‌డించారు.

ఏమిటీ పికాక్స్ మౌంటెన్?

ఇరాన్‌లోని నతాంజ్ (Natanz) అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ అత్యంత పటిష్టమైన భూగర్భ సొరంగాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సున్నితమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి, అణు పదార్థాలను నిల్వ చేయడానికి దీనిని నిర్మించినట్లు పాశ్చాత్య నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. గతంలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, పికాక్స్ మౌంటెన్ భూగర్భంలో అత్యంత దృఢంగా నిర్మించడం వ‌ల్ల‌ సాధారణ వైమానిక దాడులతో దీనిని ధ్వంసం చేయడం కష్టమని భావించి అప్పట్లో వదిలేసింది. కాగా, అక్కడ ఎటువంటి అణు కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఇరాన్ మొదటి నుంచీ ఖండిస్తూ వస్తున్న‌ది.

Advertisement
Advertisement