Sanju Samson | జట్టులో చోటే దక్కని పరిస్థితుల నుంచి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ వరకు.. సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ జర్నీ..!
Sanju Samson | భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించించి విశ్వవిజేతగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా తొలిసారిగా టైటిల్‌ను నిలబెట్టుకున్న జట్టుగా ఘనత సాధించింది. అలాగే, స్వదేశంలో జరిగిన టోర్నీ గెలిచిన ఏకైక జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు.
Sanju Samson | భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించించి విశ్వవిజేతగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా తొలిసారిగా టైటిల్‌ను నిలబెట్టుకున్న జట్టుగా ఘనత సాధించింది. అలాగే, స్వదేశంలో జరిగిన టోర్నీ గెలిచిన ఏకైక జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. కీలకమైన సూపర్8, సెమీస్‌తో పాటు ఫైనల్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్ జట్టులో శాంసన్‌కు చోటు అంత సులభంగా ఏమీ దక్కలేదు. ప్రపంచకప్‌కు ముందు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో రాణించకపోవడంతో ప్లేయింగ్-11లోనూ చోటు దక్కలేదు. అయినా, ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. అవకాశం వచ్చిన ప్రతీసారి తనను తాను నిరూపించుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
టోర్నీలో మొత్తం 326 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో విజయం అనంతరం శాంసన్ తాను ఎదుర్కొన పరిస్థితులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత తాను ఎంతగానో నిరాశకు గురయ్యానని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ విజయంలో రాణించడం కలగా అనిపిస్తోందని తెలిపాడు. తన మూడు హాఫ్ సెంచరీలను గుర్తు చేసుకుంటూ.. ఈ ప్రయాణం రెండేళ్ల కిందటే మొదలైందని. 2024 ప్రపంచకప్ జట్టులో ఉన్నా తనకు ఆడే అవకాశం రాలేదని.. అయినా ఆ పరిస్థితులను తలచుకుంటూ అవకాశం వస్తే ఎలా ఆడాలనే దానిపై కష్టపడ్డట్లు తెలిపాడు. ‘న్యూజిలాండ్ సిరీస్ తర్వాత తన మనసు విరిగిపోయింది. ఆ సమయంలో నా కలలన్నీ ఛిద్రమయ్యాయని అనిపించింది. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా మంది మాజీ క్రికెటర్లు నాకు ధైర్యం చెప్పారు. గత కొన్ని నెలలుగా సచిన్ టెండూల్కర్ సర్‌తో తరచూ మాట్లాడుతున్నాను. ఆయనతో దీర్ఘంగా చర్చలు జరిపారు. అలాంటి లెజెండ్ నుంచి మార్గదర్శకం పొందడం గొప్ప విషయం. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడైతే ఈ విజయాన్నే ఆస్వాదించాలనుకుంటున్నానని.. తర్వాత ఏమి చేయాలో కొన్ని రోజుల్లో ఆలోచిస్తానని తెలిపాడు.
3️⃣2️⃣1️⃣ RUNS 🔥
3️⃣ FIFTIES 👏
8️⃣0️⃣.2️⃣5️⃣ AVERAGE ✨A performance for the ages from SANJU SAMSON 🫡#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ | @IamSanjuSamson pic.twitter.com/oUDtppO3Mv
— BCCI (@BCCI) March 8, 2026
తాజావార్తలు
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
- ●Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల





