Arshdeep Singh | బాల్‌తో కొట్టిన అర్ష్‌దీప్.. కోపంతో దూసుకొచ్చిన డారెల్ మిచెల్.. వీడియో
Arshdeep Singh | భారత క్రికెట్ (Team India) జట్టు నయా చరిత్ర లిఖించింది. పొట్టి ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని చాటిచెబుతూ మూడు టీ20 వరల్డ్ కప్‌లను (T20 World Cup) సొంతం చేసుకున్నది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అయితే మ్యాచ్ సందర్భంగా మైదానంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) మధ్య జరిగిన వాగ్వాదం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.
Arshdeep Singh | త్రినేత్ర.న్యూస్: భారత క్రికెట్ (Team India) జట్టు నయా చరిత్ర లిఖించింది. పొట్టి ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని చాటిచెబుతూ మూడు టీ20 వరల్డ్ కప్‌లను (T20 World Cup) సొంతం చేసుకున్నది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో భారత్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. అయితే మ్యాచ్ సందర్భంగా మైదానంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) మధ్య జరిగిన వాగ్వాదం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ టపటపా వికెట్లు కోల్పోయింది. దీంతో వారికి పరుగులు రావడం ఒకింత కష్టంగా మారింది. ఈ సమయంలో ఇన్నింగ్స్ 10వ ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఆ ఓవర్‌లో 4వ బంతిని డారిల్ మిచెల్ నేరుగా బౌలర్ వైపు ఆడాడు. బంతిని అందుకున్న అర్ష్‌దీప్ వెంటనే వికెట్ల వైపు విసరగా.. అది మిచెల్ తొడకు బలంగా తాకింది.
అనవసరమైన త్రో కావడంతో పాటు, అర్ష్‌దీప్ వెంటనే క్షమాపణ చెప్పకపోవడంతో మిచెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకేమీ పట్టనట్టు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న బౌలర్ వెనకాలే మిచెల్ ఆవేశంగా వచ్చేశాడు. ఇదేదో గొడవకు దారితీసేలా ఉందనుకున్న అంపైర్ బ్యాట్స్‌మెన్‌ను ఆపాడు. అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా మిచెల్ వెనక్కి తగ్గలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటుతుందన్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకున్నాడు. దీంతో మిచెల్ శాంతించాడు. అంపైర్‌తో మాట్లాడిన అనంతరం అర్ష్‌దీప్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ కరచాలనం చేసుకుని గొడవకు ముగింపు పలికారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటర్లు అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52), ఇషాన్ కిషన్ (25 బాల్స్‌లో 54), సంజు శాంసన్ (46 బంతుల్లో 89) మెరుపులకు బౌలర్లు బుమ్రా (4జ15), అక్షర్ పటేల్ (3జ27) ప్రదర్శన జోడవడంతో 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది.
https://x.com/StarSportsKan/status/2030688420776018354
తాజావార్తలు
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
- ●Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల






