Iran postpones Khameneis funeral | ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ప్రకటించిన ఇరాన్
Iran postpones Khameneis funeral | గత నెల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో (US-Israeli strike) ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలు వాయిదా పడ్డాయి (Iran postpones Khameneis funeral).
International | Published On Mar 5, 2026, 10.13 am IST
Iran postpones Khameneis funeral | గత నెల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో (US-Israeli strike) ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలు వాయిదా పడ్డాయి (Iran postpones Khameneis funeral). ఖమేనీకి కడసారి వీడ్కోలు పలికేందుకు లక్షలాది మంది జనం వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. తగిన ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మోహసిన్ మహముది ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు. త్వరలో అంత్యక్రియల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
కాగా, ఖమేనీ జన్మించిన మషాద్‌లోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమేనీ భౌతికకాయాన్ని అక్కడికి తరలించారు కూడా. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని తొలుత ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా వేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను సమన్వయ మండలి అధ్యక్షుడు మెహసిన్ మహ్మదీ పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఖమేనీ మృతికి ఇరాన్ ఇప్పటికే 40 రోజుల సంతాప దినాలను పాటిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులు వరుసగా ఆరో రోజుకు చేరాయి. టెహ్రాన్‌పై అమెరికా దళాలు దాడులు కొనసాగిస్తుండగా.. ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei)ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఆయన కూడా తమ టార్గెటే అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. సుప్రీం లీడర్‌గా (Irans Supreme Leader) ఎవరు ఎన్నికైనా వారు కూడా తమ హిట్‌లిస్ట్‌లో ఉంటారని హెచ్చరించింది. కొత్తగా ఎన్నికయ్యేది ఎవరైనా సరే అతన్ని కూడా అంతం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించింది.
Also Read..
Virosh Wedding | సెలబ్రేషన్స్ ముగిశాయి.. ఇక అండర్‌గ్రౌండ్‌కే : విజయ్ దేవరకొండ
Nitish Kumar | రాజ్యసభ బరిలో నితీశ్ కుమార్.. 11.30 గంటలకు నామినేషన్ వేయనున్న బీహార్ సీఎం!
Daily Life Tips | మీ మాటలతో ఇతరులను ఆకట్టుకోండి.. కానీ విమర్శలకు దూరంగా ఉండండి..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త ‘సుప్రీం లీడర్’ దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
జులై 5, 2026

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
జులై 4, 2026

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
- ●Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల



