mass shooting | 8 మంది చిన్నారులను కాల్చి చంపిన వ్యక్తి.. మృతుల్లో ఏడుగురు అతడి పిల్లలే
mass shooting | అమెరికాలోని లూసియానా (Louisiana) రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి ఎనిమిది మంది చిన్నారులను (children) కాల్చి చంపాడు (mass shooting).
International | Published On Apr 20, 2026, 10.17 am IST
mass shooting | అమెరికాలోని లూసియానా (Louisiana) రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి ఎనిమిది మంది చిన్నారులను (children) కాల్చి చంపాడు (mass shooting). అందులో ఏడుగురు అతడి సొంత పిల్లలే కావడం గమనార్హం. శ్రీవ్‌పోర్ట్ నగరంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరణించిన పిల్లల వయస్సు ఏడాది నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుందని శ్రీవ్‌పోర్ట్ (Shreveport) పోలీస్ విభాగం ప్రతినిధి క్రిస్ బోర్డెలాన్ వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
బోర్డెలాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని షమార్ ఎల్కిన్స్‌గా గుర్తించారు. చిన్నారులపై కాల్పులు జరిపిన అనంతరం తుపాకీతో బెదిరించి ఓ వాహనాన్ని లాక్కుని పారిపోతుండగా... పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. ఈ ఘటనకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, కుటుంబ కలహాలే ఈ హింసాకాండకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నట్లు బోర్డెలాన్ తెలిపారు. ఇది చాలా భయంకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి ఘటన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్కిన్స్ గతంలో కూడా ఓ సారి అరెస్ట్ అయినట్లు ఈ సందర్భంగా బోర్డెలాన్ వెల్లడించారు.
Also Read..
హర్మూజ్‌లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ జెండాతో వెళ్తున్న నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభత్సం.. వ్యక్తి వృతి
హ్యాపీ బర్త్‌డే మావయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్
సంబంధిత వార్తలు

LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
జులై 6, 2026

Sting energy drink | పాఠశాలల సమీపంలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
జులై 3, 2026

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Oil Palm Complex | ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్
- ●TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కుతున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు
- ●Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
- ●Tollywood | అందాల భామలు.. తగ్గేదేలే!
- ●Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రివార్డుల్లో కోత.. కారణాలేంటి..?
- ●Meta | ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై మెటా వివరణ.. చిన్నారుల భద్రత కోసం కోట్ల అకౌంట్లపై చర్యలు..

Oil Palm Complex | ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్

TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కుతున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే

Tollywood | అందాల భామలు.. తగ్గేదేలే!



