Strait of Hormuz | హర్మూజ్‌లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ జెండాతో వెళ్తున్న నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
Strait of Hormuz | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక టౌస్కా (Touska)పై అమెరికా నౌకాదళం కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఆ నౌకను స్వాధీనం చేసుకుంది.
Strait of Hormuz | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక టౌస్కా (Touska)పై అమెరికా నౌకాదళం కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఆ నౌకను స్వాధీనం చేసుకుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ (Gulf of Oman) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కాగా, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామంటూ అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల తర్వాత టెహ్రాన్‌కు చెందిన నౌకను యూఎస్ నేవీ (US Navy) స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.
ఇక ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. టౌస్కాపై జరిగిన దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ చర్యకు త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అదేసమయంలో ఇస్లామాబాద్ వేదికగా అమెరికాతో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చల్లో పాల్గొనేందుకు టెహ్రాన్ నిరాకరించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
కాగా, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ - హిజ్బుల్లా యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత, జలసంధిని తెరుస్తామని ఇరాన్ గతంలో ప్రకటించింది. కానీ, అమెరికా దిగ్బంధనం కాల్పుల విరమణ ఉల్లంఘనే అని పేర్కొంటూ ఇరాన్ శనివారం తన నిర్ణయాన్ని మార్చుకుంది. జలసంధి నియంత్రణ పూర్తిగా తమ సాయుధ దళాల చేతుల్లోకి వెళ్లిందని జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధిని సమీపిస్తే శత్రువులకు సహకరిస్తున్నట్లుగానే పరిగణిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ గార్డ్స్ 'తస్నిమ్' న్యూస్ ఏజెన్సీ ద్వారా హెచ్చరించారు.
Les forces iraniennes ont ciblé des navires de guerre américains avec des drones après que des Marines aient attaqué et abordé le M/V Touska battant pavillon iranien - Tasnim.
Vidéo : interception du M/V Touska par la marine américaine pic.twitter.com/8Ac5Tzwvob
— Renard Jean-Michel (@Renardpaty) April 20, 2026
Also Read..
కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభత్సం.. వ్యక్తి వృతి
హ్యాపీ బర్త్‌డే మావయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్
సంబంధిత వార్తలు

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
జులై 8, 2026

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
జులై 7, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ షురూ
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
- ●EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి

Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..



