Donald Trump | ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..? పెంటగాన్‌కు సమాచారం ఇచ్చిన ఇజ్రాయెల్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ (Israel) హెచ్చరించింది. పెంటగాన్‌కు సమాచారం అందించింది.
International | Published On Jul 10, 2026, 10.30 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. రెండు వారాల క్రితం ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం అటకెక్కింది. మరోసారి ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల వేళ ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ (Israel) హెచ్చరించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ సరికొత్త కుట్రను సిద్ధం చేస్తోందని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ (Israeli intelligence) పెంటగాన్‌కు సమాచారం అందించింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రూపొందించిన ప్రత్యేక ప్రణాళికను ఇజ్రాయెల్ అగ్రరాజ్యానికి అందజేసింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేస్తోందని ఆరోపిస్తూ.. అమెరికా దళాలు ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పూనుకున్న నేపథ్యంలో ఈ ఇంటెలిజెన్స్ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.
అయితే, అమెరికా అధికారులు మాత్రం ఇజ్రాయెల్ నివేదిక వెనుక మరో కుట్ర ఉండొచ్చని భావిస్తున్నాయి. ఇరాన్‌పై మరింత సైనిక చర్యలకు ట్రంప్‌ను ఒప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారం ఇచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఇరాన్ హిట్ లిస్ట్‌లో తాను అగ్రస్థానంలో ఉన్నట్లు తనకు తెలిసిందంటూ ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ హెచ్చరికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
సంబంధిత వార్తలు

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
ఆగస్టు 22, 2026

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
ఆగస్టు 18, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



