Mojtaba Khamenei | ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి.. అసలు శత్రువును గుర్తించాలి : మొజ్తబా ఖమేనీ పిలుపు
ఆరు నెలలుగా బహిరంగంగా కనిపించని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన లేఖ రాశారు. ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని, అసలు శత్రువును గుర్తించాలని పిలుపునిచ్చారు.
International | Published On Aug 30, 2026, 4.24 pm IST
సంక్షిప్త సారాంశం
తండ్రి మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ గత ఆరు నెలలుగా ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. తాజాగా ఆయన ముస్లిం దేశాలను ఉద్దేశించి ఒక సంచలన లేఖను విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని అందులో పిలుపునిచ్చారు. అంతర్గత విభేదాలు పక్కనపెట్టాలని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో డాలర్ల (De-dollarisation) వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
- ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన లేఖ
- 'అసలు శత్రువును గుర్తించండి' అంటూ ముస్లిం దేశాలకు పిలుపు
Mojtaba Khamenei | త్రినేత్ర.న్యూస్ : తన తండ్రి అలీ ఖమేనీ మరణం (ఫిబ్రవరి 28) తర్వాత ఇరాన్ (Iran) సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరు నెలలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. కనీసం ఆయనకు సంబంధించిన ఎలాంటి వీడియో గానీ, ఆడియో గానీ ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ, మిడిల్ ఈస్ట్ (Middle East) వార్ మొదలై ఆరు నెలలైన సందర్భంగా ఆయన ఆదివారం ఒక సంచలన లేఖను విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకుని ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని అందులో పిలుపునిచ్చారు.
అదే ఇస్లాం శత్రువులకు బలం..
ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఈ సందేశాన్ని పంపారు. "ఇస్లామిక్ దేశాల సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం.. మనమంతా స్నేహంగా, ఐకమత్యంగా ఉండటమే. ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేలా ఎవరు ప్రవర్తించినా, అది పరోక్షంగా ఇస్లాం.. శత్రువులకు మేలు చేసినట్లే" అని ఆయన తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
మీ అసలు శత్రువును గుర్తించండి
ప్రాంతీయ దేశాల పాలకులందరూ "మీ అసలు శత్రువును గుర్తించండి, వారి కుట్రలను అర్థం చేసుకోండి, వారిని ధైర్యంగా ఎదుర్కోండి" అంటూ పరోక్షంగా అమెరికా (US), ఇజ్రాయెల్ (Israel) లపై విరుచుకుపడ్డారు. ఈ యుద్ధ సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయా అరబ్ దేశాలతో ఇరాన్ సంబంధాలు క్షీణించాయి.
డాలర్ల వాడకం తగ్గించండి..
ఇరాన్ ప్రజలు, అధికారులు తమ మధ్య ఉన్న బేధాభిప్రాయాలను పక్కనపెట్టి దేశ సమగ్రత కోసం కష్టపడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అమెరికా ఆంక్షల (Sanctions) వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు డీ-డాలరైజేషన్ (De-dollarisation) దిశగా అడుగులు వేయాలని ఖమేనీ పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధి కోసం దేశీయ ఉత్పత్తులను పెంచాలని తన లేఖలో స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US strikes | వివాహ వేడుకపై అమెరికా క్షిపణి దాడి.. చిన్నారి సహా ఐదుగురు మృతి
సెప్టెంబర్ 2, 2026

Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్
ఆగస్టు 9, 2026

Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
జులై 14, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



