Nora Fatehi | సర్కే చునర్ సాంగ్ వివాదం.. నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ చివరి ఛాన్స్..!
Nora Fatehi | మార్చిలో విడుదలైన కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్‌లోని సర్కే చున్ తేరి సర్కే సాంగ్‌పై పెద్ద వివాదమే చెలరేగింది. సాంగ్‌లో నటించిన నోరా ఫతేహీ, సంజయ్ దత్ నటించిన ఈ పాటలోని పదాలు, డ్యాన్స్ అభ్యంతరకరంగా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Entertainment | Published On Apr 8, 2026, 8.37 am IST
Nora Fatehi | మార్చిలో విడుదలైన కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్‌లోని సర్కే చున్ తేరి సర్కే సాంగ్‌పై పెద్ద వివాదమే చెలరేగింది. సాంగ్‌లో నటించిన నోరా ఫతేహీ, సంజయ్ దత్ నటించిన ఈ పాటలోని పదాలు, డ్యాన్స్ అభ్యంతరకరంగా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగి నోరా ఫతేహితో పాటు పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6న జరిగిన విచారణకు నోరా ఫతేహీ తరఫున ఆమె న్యాయవాది హాజరయ్యారు. న్యాయవాది హాజరుకావడాన్ని కమిషన్ అంగీకరించలేదు. స్వయంగా నోరా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో చివరి అవకాశం ఇస్తూ ఏప్రిల్ 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. గత విచారణ సమయంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహాత్కర్ అధ్యక్షత వహించారు. పాటలోని పదాలు మహిళల గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పాట అర్థం తెలియదంటూ పలువురు చేసిన వాదనలను ఆమె తిరస్కరించారు.
విచారణకు హాజరైన గీత రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు గౌతమ్ కేఎం, సుప్రిత్ లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు. ఈ పాట సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంగీకరించారు. మహిళల సాధికారత కోసం వచ్చే మూడు నెలల పాటు పనిచేసి నివేదిక సమర్పిస్తామని కమిషన్‌కు హామీ ఇచ్చారు. ఈ పాటలోని మొదటి చరణం డబుల్ మీనింగ్‌తో లైంగిక అంశాలను సూచించేలా ఉందని.. వివాదం నేపథ్యంలో మద్యం గురించి చెప్పామని చెప్పుకొచ్చారు. అలాగే, పాటలో డాన్స్ సైతం దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



