Donald Trump | భారత్-పాక్ యుద్ధాన్ని అలా ఆపాను.. మళ్లీ పాతపాటే ఎత్తుకున్న ట్రంప్
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు.
International | Published On Jul 3, 2026, 11.35 am IST
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పాతపాటే ఎత్తుకున్నారు. గతేడాది రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానంటూ మరోసారి ప్రకటించుకున్నారు. టారిఫ్ హెచ్చరికతో రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు.
ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థికపరమైన బెదిరింపుల ద్వారా తాను ఒక్కడినే అనేక అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని తెలిపారు. "భారత్-పాక్ సహా నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. దీనిని అందరూ అంగీకరిస్తారు. ఆ ఎనిమిదింటిలో ఐదు యుద్ధాలు కేవలం టారిఫ్‌ల వల్లే ఆగిపోయాయి" అని ట్రంప్ పేర్కొన్నారు.
"గతేడాది భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఆ రెండూ అణ్వాయుధ దేశాలు కావడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో నేను రంగంలోకి దిగాను. మీరు యుద్ధం కొనసాగిస్తే 200 శాతం టారిఫ్ విధిస్తా అని ఇరు దేశాలను హెచ్చరించాను. ఆ హెచ్చరికలతో రెండు దేశాలూ శాంతించాయి. ఇక ఈ ఘర్షణల్లో 11 యద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ యుద్ధం ఆపడం వల్ల మూడు కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగినట్లు పాక్ ప్రధాని షరీఫ్ నాతో చెప్పారు" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
కాగా, గతేడాది మే నుంచి ట్రంప్ వెయ్యి సార్లైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసిఉంటారు. పాక్-భారత్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read..
జులై 5న నా పెళ్లి.. ప్రకటించిన ఆమిర్ ఖాన్
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ తరలివెళ్తున్న భక్తులు
బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
తాజావార్తలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్






