Donald Trump | హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. థాంక్స్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు
Donald Trump | హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ (US Consulate) కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Donald Trump | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ (US Consulate) కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి గౌరవం అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని (US President) తానేనని చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

ఈనెల 23న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో వేడిక నిర్వహించారు. ఈ సందర్‌భంగా యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా (Donald Trump Avenue) నామకరణం చేస్తూ రూపొందించిన శిలాఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో (Sergio Gor) కలిసి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు ఈ రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాయి. అమెరికా, తెలంగాణ మధ్య ఉన్న సత్సంబంధాలకు గుర్తుగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

2023లోనే కొత్త భవనం
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ 2008లో మొదలైంది. అప్పటి నుంచి బేగంపేటలోని 'పైగా' ప్యాలెస్‌లో కొనసాగింది. 2023లో నానక్‌రాంగూడలో ప్రస్తుత భవనంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. దాదాపు 340 మిలియన్ల డాలర్ల వ్యయంతో 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు.
ఇప్పుడు డోనల్డ్ ట్రంప్ పేరు పెట్టిన రహదారి సుమారు కిలోమీటరు పొడవు ఉంటుంది. ఇది విప్రో సర్కిల్‌కు కొంచెం దూరంలోనే ఉంటుంది. ఈ మార్గంలోనే బహుళజాతి కంపెనీలు, ఐసీఐసీఐ కార్పొరేట్ కార్యాలయం వంటివి ఉన్నాయి. ఈ రహదారి 'హైసెక్యురిటీ జోన్' కేటగిరీలో ఉంది. ఇక్కడ రెండువైపులా ప్రత్యేకంగా పోలీసు అవుట్ పోస్టులతో పహారా ఉంటుంది.

డిసెంబర్‌లోనే అనుకుని.. ఆగిపోయి..
యూఎస్ కాన్సులేట్ జనరల్ ఉన్న రహదారికి ట్రంప్ పేరు పెట్టాలని గత డిసెంబర్‌లో ప్రభుత్వం భావించింది. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచడం, ఆ తర్వాత ఇరాన్‌తో యుద్దం మొదలవ్వడం, మిడిల్ ఈస్ట్‌పై ప్రభావం.. ఇలా వరుస పరిణామాలతో వాయిదా వేసుకుంది.
తాజావార్తలు
- ●Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర..
- ●France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
- ●Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
- ●Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
- ●Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి










