Oil Prices Fall | యుద్ధానికి రెండువారాల బ్రేక్.. భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు..!
Oil Prices Fall | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను రెండువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇస్తే సైనిక చర్యను పూర్తిగా నిలిపివేసే అవకాశముందని తెలిపారు.
International | Published On Apr 8, 2026, 9.42 am IST
Oil Prices Fall | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను రెండువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇస్తే సైనిక చర్యను పూర్తిగా నిలిపివేసే అవకాశముందని తెలిపారు. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 18 శాతం తగ్గి బ్యారెల్‌కు 92.60 డాలర్లకు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 6 శాతం తగ్గి 103.40 డాలర్ల పతనమ్యాయి. అయితే, యుద్ధం ప్రారంభం నాటి కంటే ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.
మరో వైపు ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్ సుమారు 2.4 శాతం పెరిగింది. ఉద్రిక్తతలు తగ్గితే ఆర్థిక పరిస్థితులు స్థిరపడతాయన్న ఆశలో మదుపరులు ఉన్నారు. ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణపై కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండు వారాల పాటు అమెరికా, ఇరాన్ ఎలాంటి దాడులకు పాల్పడకూడదనే ఉద్దేశంతో ద్వైపాక్షిక కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. అయితే, ఈ ఒప్పందానికి షరతును విధించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవడంతో పాటు ఆటంకాలు లేకుండా నౌకల ప్రయాణం జరిగేలా చూడాలన్నారు. అదే సమయంలో ఇరాన్ అమెరికాకు పది అంశాల శాంతి ప్రతిపాదనను పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఇది ముగింపు పలికే దిశగా కీలకంగా మారే అవకాశముందని భావిస్తున్నారు. వచ్చే రెండు వారాలు పరిస్థితి ఎలా మారుతుందన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ రాజధానిలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బుధవారం ఉదయం ప్రభుత్వ అనుకూల నిరసన కారులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా అమెరికాకు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, నిరసనకారులు అంతటితో ఆగకుండా అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తగలబెట్టారు. నిరసనకారులను శాంతిపజేసేందుకు ప్రయతించినా.. వెనక్కి తగ్గకుండా ఆగ్రహంతో అమెరికా, ఇజ్రాయెల్ నశించాలంటూ నినదించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



