Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
Cult.fit IPO | బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ కల్ట్.ఫిట్ త్వరలో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. టెమాసెక్, జొమాటో, యాక్సెల్ మద్దతు ఉన్న ఈ సంస్థ సోమవారం భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని దాఖలు చేసినట్లు తెలిసింది.
Cult.fit IPO | బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ కల్ట్.ఫిట్ త్వరలో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. టెమాసెక్, జొమాటో, యాక్సెల్ మద్దతు ఉన్న ఈ సంస్థ సోమవారం భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదిత ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) పరిమాణం సుమారు రూ.4వేల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త షేర్ల జారీతోపాటు ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కూడా ఉంటుంది. ఇందులో ఓఎఫ్‌ఎస్ భాగం సుమారు రూ.3వేల కోట్లు ఉండగా, కొత్త షేర్ల జారీ ద్వారా దాదాపు రూ.950 కోట్లను సమీకరించేలా డ్రాఫ్ట్ పత్రాలు సిద్ధం చేసినట్లు సమాచారం.
పరిశీలనలో ప్రీ-ఐపీఓ ఫండింగ్ రౌండ్..
అంతేకాకుండా, ఐపీఓకు ముందు ప్రీ-ఐపీఓ ఫండింగ్ రౌండ్ నిర్వహించే అవకాశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. ఐపీఓకు ముందే నిధులు సమీకరించినట్లయితే, ఆ మొత్తాన్ని కొత్త షేర్ల జారీ భాగం నుంచి సర్దుబాటు చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఐపీఓ తుది పరిమాణం, విలువ, నిర్మాణం మార్కెట్ పరిస్థితులు, సంస్థ నిర్ణయాల ఆధారంగా మారే అవకాశం ఉంది. 2016లో ముకేశ్ బన్సాల్, అంకిత్ నాగోరి కలిసి క్యూర్.ఫిట్ పేరుతో ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం దీనిని కల్ట్.ఫిట్ గా రీబ్రాండింగ్ చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ జిమ్‌లు, డిజిటల్ ఫిట్‌నెస్ సబ్‌స్క్రిప్షన్‌లు, స్పోర్ట్స్‌వేర్, ఫిట్‌నెస్ పరికరాలు వంటి విభాగాల్లో దేశంలోని అతిపెద్ద ఫిట్‌నెస్, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఎదిగింది.
ఇన్వెస్టర్ల ఆసక్తి..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలను కలిపిన హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తున్న కల్ట్.ఫిట్, దేశవ్యాప్తంగా తన కల్ట్ సెంటర్లు, కల్ట్‌పాస్ సబ్‌స్క్రిప్షన్ వ్యవస్థ ద్వారా విస్తృతంగా సేవలు అందిస్తోంది. ఈ సంస్థపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో సింగపూర్‌కు చెందిన టెమాసెక్ తన మాక్‌రిచీ యూనిట్ ద్వారా రూ.440 కోట్లను పెట్టుబడి పెట్టి, కంపెనీలో తన వాటాను దాదాపు 12 శాతానికి పెంచుకుంది.
తాజావార్తలు
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు
- ●Stock Markets | తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్..
- ●MP Raghunandan Rao | ఇప్పుడు ఆకలైతుంది బువ్వ పెట్టమంటే.. వచ్చే ఏడాది పెడ్తడట రేవంత్‌రెడ్డి
- ●Viral Tattoo Video | ఛాతీపై స్నేహితుడి భార్య టాటూ.. వీడేం ఫ్రెండ్ రా బాబు!

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!

Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్

Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

Stock Markets | తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్..






