Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి
Singireddy Niranjan Reddy | రాష్ట్రం అధికారంలో ఉన్న ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
Singireddy Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రం అధికారంలో ఉన్న ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. కాడి పట్టాల్సిన రైతులు కాంగ్రెస్ పుణ్యాన సెల్ ఫోన్ పట్టి యూరియా బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల బుకింగ్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యాప్ ద్వారా యూరియా దొరక్క రైతులు ఆపసోపాలు పడుతున్నారని చెప్పారు. యూరియా సరఫరా చేయడం చేతకాక యాప్ తీసుకువచ్చి ఏదో సాధించినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెట్టామని చెప్పడం సర్కారు చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సాగునీరు, కరెంటు, ఎరువులు సకాలంలో రైతులకు అందకుండా సాగు విస్తీర్ణం తగ్గేందుకు సర్కారు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సాగు తగ్గితే పంటల దిగుబడి తగ్గుతుందని, తద్వారా పంటల కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతు కాంగ్రెస్ పాలనలో పంటల కొనుగోళ్ల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. యూరియా బుకింగ్ కోసం యాప్ విధానం ఎత్తేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ యాప్ విజయవంతం అని ప్రభుత్వం ప్రకటించుకోవడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. యాప్‌ను ఎత్తేసి రైతులకు యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read..
కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు
ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
సంబంధిత వార్తలు

Jagadish Reddy Birthday | లండన్‌లో ఘనంగా మాజీ మంత్రి బర్త్‌డే.. ‘జై జగదీశ్ అన్న’ నినాదాలతో హోరెత్తిన వేడుకలు
జులై 18, 2026

Pochampally Srinivas Reddy | ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కాంగ్రెస్ సర్కార్ తీరు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
జులై 18, 2026

RS Praveen Kumar | రాష్ట్రంలో అరాచక పాలన.. హౌస్ అరెస్టుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం..
జులై 18, 2026
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం



