Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
Ayatollah Ali Khamenei | అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన దివంగత ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలకు (Funeral) భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంతిమయాత్ర కొనసాగనుంది.
International | Published On Jul 3, 2026, 9.50 am IST
Ayatollah Ali Khamenei | త్రినేత్ర.న్యూస్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన దివంగత ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలకు (Funeral) భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంతిమయాత్ర కొనసాగనుంది. ఇందులో భాగంగా ఖమేనీ భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్‌కు (Tehran) తరలించారు. అక్కడి నుంచి ఫిబ్రవరి 28న ఆయన హత్యకు గురైన ప్రదేశానికి చేర్చారు. గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు (IRGC) చెందిన సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీది సహా టెహ్రాన్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితోపాటు నలుపురంగు దుస్తులు ధరించిన ఖమేనీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, టెహ్రాన్‌లో జూలై 4,5 తేదీల్లో జరగనున్న అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో జనం ప్రజలు తరలివస్తారని ఐఆర్‌జీసీ అంచనావేస్తున్నది.

ఖమేనీ అంతిమయాత్ర ఇరాన్, ఇరాక్ మీదుగా ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఈ నెల 9న ఖమేనీ (Ali Khamenei) స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నారు. కాగా, తండ్రి అత్యక్రియలకు సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) దూరంగా ఉండనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మొజ్తబా ఖమేనీ పాల్గొనబోరని భారత్‌లో ఆ దేశ ప్రతినిధి అయతుల్లా హకీం ఇలాహి వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా భద్రతా పరంగా తీవ్ర సమస్యలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆయన బయటకు రావాలని, ప్రజలను కలవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ భద్రతా సిబ్బంది అందుకు అనుమతించడం లేదన్నారు.
🚨 BREAKING:
The body of Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei has arrived at the venue for the state farewell ceremony. The mourning events are expected to begin tomorrow night and continue for several days. pic.twitter.com/cLNrd1To0Q
— Middle East Report (@ME_Report_Info) July 3, 2026
ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఖమేనీ అంత్యక్రియలు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈ నెల 7న ఖోమ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా జూలై 9న ఆయన స్వస్థలం మప్హద్‌లో అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రములు టెహ్రాన్‌కు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇరాన్ నుంచి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. అయితే కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నాయకులు సాల్మన్ ఖుర్షీద్, పవన్ ఖెరాలను కూడా ఇరాన్ ఆహ్వానించింది.
Prosesi penghormatan terakhir kepada Syahid Ayatollah Seyyed Ali Khamenei bersama putri, menantu perempuan, cucu, dan menantu laki-lakinya akan berlangsung dalam beberapa hari mendatang. Upacara ini akan dihadiri para pejabat tinggi dari berbagai negara, jutaan pengikut dan… pic.twitter.com/Gm57h9sRY7
— Iran Embassy in Indonesia (@IraninIndonesia) July 2, 2026
తాజావార్తలు
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?
- ●Voter ID Online Registration | ఓటరు కార్డు అప్లై చేసే వారికి అలెర్ట్: ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో ఈ కొత్త రూల్ తప్పనిసరి!
- ●Shyam Prasad Reddy | "జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!".. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్
- ●Jagga Reddy | హరీశ్ రావు పెట్రోల్ మీద పోసుకున్నడు కానీ.. అగ్గిపెట్టె తెచ్చుకోలే..!

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!

Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

Voter ID Online Registration | ఓటరు కార్డు అప్లై చేసే వారికి అలెర్ట్: ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో ఈ కొత్త రూల్ తప్పనిసరి!






