Strait of Hormuz | హర్మూజ్‌ను దాటాలంటే రూ.18 కోట్లు కట్టాల్సిందే..!
Strait of Hormuz | ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ (Iran) పట్టు బిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఈ జలసంధిని మూసివేసిన ఇరాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
International | Published On Mar 23, 2026, 11.31 am IST
Strait of Hormuz | ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ (Iran) పట్టు బిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఈ జలసంధిని మూసివేసిన ఇరాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక నుంచి 'ట్రాన్సిట్ ఫీజు'గా ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయాలని యోచిస్తోంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.18.76 కోట్లు. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన ఓ కీలక పార్లమెంటు సభ్యుడు అల్లాదీన్ బ్రౌజెర్డి (Alaeddin Boroujerdi) వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఫీజు వసూలు చేయడం ఇప్పటికే మొదలు పెట్టినట్లు సదరు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కాగా, ప్రపంచ ఇంధన అవసరాల్లో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంది. అయితే, గత నెల 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా హర్మూజ్‌ను టెహ్రాన్ మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడింది. కొన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశంలోనూ ఎల్పీజీ కొరత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ తీసుకున్న టోల్ ట్యాక్స్ నిర్ణయంతో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
కీలకమైన జలసంధిలో నౌకల నుంచి 'టోల్ ట్యాక్స్' గనుక అధికారికంగా వసూలు చేస్తే ఆ ప్రభావం ప్రపంచ ఇంధనరంగంపై పడనుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా పెరిగిన రవాణా ఖర్చులతో సతమతమవుతున్న షిప్పింగ్ సంస్థలపై ఇది పెను భారంగా మారనుంది. ఈ భారం ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు దారితీస్తుందనే భయాందోళనలను వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇరాన్ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యానికి కోలుకోలేని దెబ్బే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read..
విదేశాలకు బియ్యం ఎగుమతి వెనుకాల భారీ కుంభకోణం.. ఉత్తమ్‌పై హరీశ్‌రావు ఫైర్
రన్‌వేపై ట్రక్కును ఢీ కొట్టిన విమానం.. పలువురికి తీవ్ర గాయాలు
సీబీఐ అధికారులమంటూ.. వ్యాపారి నుంచి రూ.15 కోట్లు కాజేసిన నేరగాళ్లు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా






