Ayatollah Ali Khamenei | నేడు ఖమేనీ అంత్యక్రియలు.. మోజ్తబా వస్తారా?
Ayatollah Ali Khamenei | ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రయలు గురువారం జరుగనున్నాయి. ఆయన జన్మస్థలమైన మషూద్ (Mashhad)లోని ఎనిమిదో షియా ఇమామ్ అయిన ఇమామ్ రజా సమాధి దగ్గర ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు.
International | Published On Jul 9, 2026, 8.39 am IST
Ayatollah Ali Khamenei | త్రినేత్ర.న్యూస్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రయలు గురువారం జరుగనున్నాయి. ఆయన జన్మస్థలమైన మషూద్ (Mashhad)లోని ఎనిమిదో షియా ఇమామ్ అయిన ఇమామ్ రజా సమాధి దగ్గర ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ఫిబ్రవరి 28న మృతిచెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని భద్రపరిచారు. అయితే గత శనివారం ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇరాన్, ఇరాక్‌లోని వివిధ నగరాల మీదుగా సాగిన అంతిమయాత్ర కర్బలా నగరానికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు కర్బలా నగరాన్ని అతి పవిత్రక్షేత్రంగా భావిస్తారు. కాగా, ఖమేనీ చివరి కార్యక్రమానికైనా మోజ్తబా (Mojtaba Khamenei) వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ భద్రతా సంస్థల (IRGC) సమాచారం ప్రకారం.. తండ్రి కోసం వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయడానికి ఆయన కనీసం ఈ కార్యక్రమానికైనా హాజరు కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు మోజ్తబా ఏమయ్యారు?
మార్చిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోజ్తబా పబ్లిక్‌గా ఎక్కడా కనిపించలేదు. గత వారం తన భార్య జహ్రా హదాద్-అడెల్, కుమారుడి సంస్మరణ సభకు కూడా ఆయన హాజరుకాలేదు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఖమేనీ కుటుంబంపై చేసిన వైమానిక దాడుల్లో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని.. ఆయన కాళ్లకు, ముఖానికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయని రాయిటర్స్వా ర్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.

భౌతికకాయాన్ని ఇంతకాలం ఎలా భద్రపరిచారు?
అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను ఇంతకాలం ఎలా భద్రపరిచారు, ఖననానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ, దీనిపై ఇరాన్ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. భౌతికకాయాన్ని రసాయనాలతో భద్రపరచడాన్ని ఇస్లాంలో వ్యతిరేకిస్తారు కాబట్టి సాధారణంగా మరణించిన వెంటనే ఖననం చేస్తారని విశ్లేషకులు అంటున్నారు.
`చల్లని ఉష్టోగ్రతలో ఉండే కోల్డ్ స్టోరేజ్ పద్ధతి ఉపయోగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేగానీ ఎంబామింగ్ పద్ధతిలో కాదు. ఎందుకంటే ఇస్లాంలో రసాయన ఎంబామింగ్‌పై నిషేధం ఉంది. షియా చట్టం ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో ఖననాన్ని వాయిదా వేయడానికి, భౌతికకాయాన్ని చల్లని ప్రదేశంలో భద్రపరచడానికి అనుమతి ఉంటుంది. సుప్రీం లీడర్ విషయంలో మత పెద్దల నుంచి మినహాయింపులను సులభంగా పొందవచ్చు` అని కౌంటర్ టెర్రరిజం నిపుణులు డాక్టర్ ఒమర్ మొహమ్మద్ చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






