త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

చైనాను వణికిస్తున్న వరదల్లో ఊహించని విపత్తు. వరద నీటిలో ఏకంగా 900 విష సర్పాలు కొట్టుకొచ్చాయి. పాముకాటుతో ఓ మహిళ మృతి చెందగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

J

Viral news | Published On Jul 9, 2026, 7.13 pm IST

China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి
Advertisement
  • చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పోటెత్తిన వరదలు
  • హెంగ్‌జౌ నగరంలోని బ్రీడింగ్ ఫామ్స్ దెబ్బతినడంతో వరద నీటిలో తప్పించుకున్న సుమారు 900 పాములు, విషపూరిత నాగుపాములు
  • రహదారులు దెబ్బతినడంతో ఆసుపత్రికి వెళ్లలేక పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన మహిళ 
  • సోషల్ మీడియాలో వరద నీటిలో పాములు ఈదుతున్న వీడియోలు వైరల్‌

China Floods | త్రినేత్ర.న్యూస్ : చైనాను (China) భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గ్వాంగ్సీ ప్రావిన్స్‌లోని హెంగ్‌జౌ (Hengzhou) నగరంలో వరద బీభత్సానికి ఓ ఊహించని విపత్తు తోడైంది. భారీ వరదల కారణంగా స్థానికంగా ఉన్న బ్రీడింగ్ ఫామ్స్ నుంచి ఏకంగా 900 పాములు (Snakes) తప్పించుకున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు (Cobras) కూడా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలు.. ప్రాణం తీసిన ట్రాఫిక్

వరద నీటిలో ఈదుకుంటూ వస్తున్న ఈ పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral videos) అవుతున్నాయి. నడుములోతు నీళ్లలో పాములను పట్టుకునేందుకు జనం తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అయితే, ఈ విపత్తులో ఓ విషాదం కూడా చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకొచ్చిన ఓ పాము కాటు వేయడంతో ఓ మహిళ మృతి చెందింది. రోడ్లన్నీ నీటమునగడంతో (Roadblocks) ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయారని, ట్రీట్‌మెంట్ (Treatment) అందడంలో జరిగిన జాప్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని స్థానిక మీడియా వెల్లడించింది.

3 కోట్ల పాములకు కేరాఫ్ అడ్రస్

తప్పించుకున్న పాములను పట్టుకునేందుకు అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్స్‌ను (Rescue teams) రంగంలోకి దించారు. పాముకాటుకు గురైన వారికి తక్షణ వైద్యం అందించేందుకు తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. వాస్తవానికి గ్వాంగ్సీ ప్రాంతం చైనాలోనే అతిపెద్ద కమర్షియల్ స్నేక్ ఫార్మింగ్ (Snake farming) హబ్. ఇక్కడ సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు, మాంసం కోసం దాదాపు 3 కోట్ల పాములను పెంచుతుంటారు. ఇప్పుడు ఈ ఫామ్స్ అన్నీ వరదల్లో మునిగిపోవడంతో వందలాది పాములు జనావాసాల్లోకి వచ్చేశాయి.

జూ నుంచి జంతువులు ఎస్కేప్

కేవలం పాములు మాత్రమే కాదు, వరదల ధాటికి స్థానిక జూ (Zoo) ఎన్‌క్లోజర్లు సైతం దెబ్బతిన్నాయి. దీంతో అల్పాకాలు, జీబ్రాలు, మినీయేచర్ పందులు వంటి వందకు పైగా జంతువులు తప్పించుకున్నాయి. రిజర్వాయర్లు (Reservoirs) కట్టలు తెంచుకోవడంతో నగరాలకు నగరాలే జలమయమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు ఆరుగురు చనిపోగా.. సుమారు 1,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు (Evacuated). 8,000 మంది సిబ్బంది, 5,700 పడవలతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement