Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
Chabahar Port | ఇరాన్‌లోని వ్యూహాత్మక ఓడరేవు చాబహార్ పోర్టు (Chabahar Port)పై అమెరికా భారీ దాడులు చేసింది. చాబహార్‌లోని కీలక సదుపాయాలే లక్ష్యంగా వైమానికి దాడులు చేసింది. ఈ దాడులతో ఆ ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
International | Published On Jul 9, 2026, 1.42 pm IST
Chabahar Port | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ (US-Iran) మధ్య కొన్ని వారాల క్రితం కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టి ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్‌లోని వ్యూహాత్మక ఓడరేవు చాబహార్ పోర్టుపై అమెరికా భారీ దాడులు చేసింది. చాబహార్‌లోని కీలక సదుపాయాలే లక్ష్యంగా వైమానికి దాడులు చేసింది. ఈ దాడులతో ఆ ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడులతో పోర్టు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత ఈ పోర్టుపై దాడి జరగడం ఇదే తొలిసారి అని ఇరాన్ మీడియా నివేదించింది.
Footage shows a US airstrike on the Iranian port of Chabahar, destroying the main maritime control tower. pic.twitter.com/1p9KRDiziB
— The Hormuz Letter (@HormuzLetter) July 8, 2026
భారత్‌కు వ్యూహాత్మకం...
చాబహార్ ఓడరేవు భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. ఇది మధ్య ఆసియాను హిందూ మహాసముద్రంతో కలిపే ఓ వ్యూహాత్మక, పన్ను రహిత కేంద్రంగా ఉంది. ఇది ఇరాన్‌కు సముద్ర రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంతేకాదు, ఒమన్ గల్ఫ్ తీరంలో ఉన్న ఈ జోన్.. ఇరాన్ హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం కూడా. హర్మూజ్ గుండా వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించొచ్చు. ఇరాన్‌కు ఇది ఆర్థికంగా కీలక ప్రాంతం. భారత్ పెట్టుబడులతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. చాబహార్‌లోని షాహిద్ బెహెస్టి టెర్మినల్‌ను ఇండియన్ పోర్ట్స్‌గ్లోబల్ లిమిటెడ్ (India Ports Global Ltd) నిర్వహించేందుకు, స్వల్పకాలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత్ 2024 మేలో ఇరాన్‌తో పది సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్‌లో దాదాపు 370 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సవాళ్ల నేపథ్యంలో భారత భౌగోళిక, ఆర్థిక వ్యూహాలకు ఈ చాబహార్ ఓ మూలస్తంభం వంటిదని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌కు ఈ ఓడరేవు కేవలం ఓ వ్యాపార కేంద్రం మాత్రమే కాదు.. హిందూ మహాసముద్రం ద్వారా ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలను చేరుకునేందుకు కీలక మార్గం కూడా. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఇతర దేశాలతో వాణిజ్యం జరపడానికి ఈ మార్గం చాలా కీలకంగా ఉంటుంది. ఆయా దేశాలకు ఇక్కడి నుంచి సరకులు రవాణా చేయాలని భారత్ భావిస్తోంది.
Also Read..
భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం సరఫరా చేస్తుంది : ప్రధాని మోదీ
అవి భరించలేకే దీపికా పడుకోణ్‌ను కల్కి 2 నుంచి తీసేశారు - టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
బడే భాయ్, చోటే భాయ్, మిడిల్ భాయ్ కలిసి సింగరేణిని ముంచుతున్నరు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం
- ●HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ






