plane rams truck | రన్‌వేపై ట్రక్కును ఢీ కొట్టిన విమానం.. పలువురికి తీవ్ర గాయాలు
plane rams truck | అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్ కెనడాకు చెందిన ఎక్స్‌ప్రెస్ విమానం (Air Canada plane) రన్‌వేపై ఉన్న గ్రౌండ్ వెహికల్‌ను ఢీ కొట్టింది (plane rams truck).
International | Published On Mar 23, 2026, 10.47 am IST
plane rams truck | అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్ కెనడాకు చెందిన ఎక్స్‌ప్రెస్ విమానం (Air Canada plane) రన్‌వేపై ఉన్న గ్రౌండ్ వెహికల్‌ను ఢీ కొట్టింది (plane rams truck). ఈ ఘటనలో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. న్యూయార్క్ (New York)లోని లాగార్డియా విమానాశ్రయంలో (LaGuardia airport) సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ CRJ-900 విమానం లాగార్డియా విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ఉన్న ఒక ఫైర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆ సమయంలో విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో కొందరికి గాయాలైనట్లు సదరు కథనం నివేదించింది.
అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలో విమాన రాకపోకలను యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
యాపిల్ తదుపరి సీఈవోగా జాన్ టెర్నస్..? టిమ్ కుక్ పదవీ విరమణపై స్పష్టత..
ఆర్టీసీ లాభాల్లో ఉందా..? నష్టాల్లో ఉందా..? ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
సీబీఐ అధికారులమంటూ.. వ్యాపారి నుంచి రూ.15 కోట్లు కాజేసిన నేరగాళ్లు
సంబంధిత వార్తలు

Empire State Building | సినిమా తరహాలో ప్రమాదకర స్టంట్స్.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
జులై 2, 2026

Telangana Formation Day | అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
జూన్ 3, 2026

NYTTA | అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం.. నైటా ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్ట్
మార్చి 8, 2026
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా



