Harish Rao | విదేశాలకు బియ్యం ఎగుమతి వెనుకాల భారీ కుంభకోణం.. ఉత్తమ్‌పై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు. ఇది ఒక పెద్ద స్కాం. ఫిలిఫైన్‌కు బియ్యం పంపడం వెనుకాల ఓ భారీ కుంభకోణం జరిగింది. మంత్రి తెలివిగా సమాధానం చెప్పారు. సత్యదూరమైన విషయాలు, సమాచారాన్ని కొంత ఆపి కొంత దాచిపెట్టే ప్రయత్నం చేశారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు. ఇది ఒక పెద్ద స్కాం. ఫిలిఫైన్‌కు బియ్యం పంపడం వెనుకాల ఓ భారీ కుంభకోణం జరిగింది. మంత్రి తెలివిగా సమాధానం చెప్పారు. సత్యదూరమైన విషయాలు, సమాచారాన్ని కొంత ఆపి కొంత దాచిపెట్టే ప్రయత్నం చేశారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
బియ్యం పిలిఫైన్‌కు, ఇతర దేశాలకు పంపేందుకు ఒక అడ్వైజర్‌ను పెట్టుకున్నారా..? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్‌చంద్ గార్గ్. ఈయన ఘరానా మోసగాడు. సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టు అయి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి. జైలు పాలై కేసులు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తిని మీరు అడ్వైజర్‌గా పెట్టుకున్నారా..? పెట్టుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడు. లేదా ఆయనను తొలగించారా..? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బియ్యం ఎగుమతి కోసం టెండర్లు పిలిచారా..?
విదేశాలకు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపేందుకు ఎంవోయూ చేసుకున్నారు. మాకు బియ్యం ఇవ్వండని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ రాష్ట్రానికి రెండుసార్లు లేఖ రాసింది. కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే వెంటనే డబ్బులు చెల్లిస్తామని నాఫెడ్ రాష్ట్రానికి చెప్పింది. కేంద్రానికి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రయివేటు సంస్థకు ఎందుకు ఇచ్చారు. బియ్యం ఎగుమతి కోసం టెండర్లు పిలిచారా..? ప్రభుత్వ రంగం సంస్థకు ఇవ్వకుండా ప్రయివేటు సంస్థకు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
7500 టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవం కాదా..?
22500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగమతి చేశామని మంత్రి చెప్పారు. మరో 7500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. అవి ముక్కిపోతాయి పురుగులు పడ్డాయి. ఆ గోడౌన్ ఛార్జిలు ఎవరు కట్టాలి.. రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అగ్రిమెంట్ కూడా తప్పుంది. వీళ్లే షిప్‌లో ఎక్కించి అక్కడ చేరుకునే వరక వీరే బాధ్యత తీసుకున్నారు. 7500 టన్నులు కాకినాడ పోర్టులో ఏడాది నుంచి ఉంటున్నది వాస్తవం కాదా..? ఒక ఏడాది నుంచి కాకినాడ పోర్టులో ఉంటే గోడౌన్ చార్జీలు ఎంత పడ్డాయో సమాధానం చెప్పాలి. మంత్రి తెలివిగా రూ. కోటి లాభం వచ్చిందని చెబుతున్నారు. మరి మిగిలిన బియ్యం గురించి సమాధానం చెప్పాలి. ఆ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కాకినాడ పోర్టుకు మంత్రి హెలికాప్టర్‌లో పోయారు. మొత్తానికి దీని వెనుక పెద్ద స్కాం జరిగింది రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఒక హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిజనిజాలు బయటకు రావాలి. కాకినాడ పోర్టుకు పోదాం. ఇక ఈ కుంభకోణం వెనుకాల ఎంత నష్టం జరిగిందో మంత్రి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా






