త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో భారత కంపెనీకి చెందిన కుసుమ్ గ్రూప్ ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

J

International | Published On Oct 4, 2026, 4.35 pm IST

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం

సంక్షిప్త సారాంశం

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న భారత్‌కు చెందిన ప్రముఖ 'కుసుమ్ గ్రూప్' ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి చేసింది. దాడి కారణంగా ప్లాంట్ ప్రధాన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి వల్ల సంస్థకు దాదాపు రూ. 400 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రష్యా సాధారణ ఫార్మా వేర్‌హౌస్‌పై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు.

Advertisement

Russian Drone Attack Sumy | త్రినేత్ర న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో భారతీయుడి యాజమాన్యంలో నడుస్తున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ 'కుసుమ్ గ్రూప్' (Kusum Group) ప్లాంట్‌పై రష్యా బలగాలు డ్రోన్లతో దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. సుమారు రూ. 400 కోట్ల విలువైన మౌలిక వసతులు, మెడిసిన్ నిల్వలు బూడిదయ్యాయి.

ఇదీ చదవండి : యావత్ ప్రపంచానికే నువ్వు హీరోవి : స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించిన నెతన్యాహు

మంటల్లో కాలిపోయిన ప్లాంట్

డ్రోన్లు నేరుగా ఫార్మా ప్లాంట్‌పై పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. ఈ దాడి ధాటికి ప్లాంట్‌కు సంబంధించిన మెయిన్ స్ట్రక్చర్ దాదాపు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోందని, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Also Read : ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ్ : పుతిన్

దాడిని తీవ్రంగా ఖండించిన జెలెన్‌స్కీ

ఈ దారుణ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ 'ఎక్స్' వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

"రష్యన్లు మరోసారి కీవ్‌లోని వంతెనను లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాకుండా సుమీలోని సాధారణ ఫార్మా వేర్‌హౌస్‌పై డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. అటు డినిప్రోలో కమ్యూనికేషన్ కేంద్రాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో మొత్తం ఆరుగురు గాయపడ్డారు." అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు.

భారతీయ మూలాలున్న ‘కుసుమ్ గ్రూప్’ ప్రస్థానం

భారతీయుడైన రాజీవ్ గుప్తా సారథ్యంలో నడుస్తున్న కుసుమ్ గ్రూప్.. 1994లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌‌గా ప్రారంభమైంది. అనంతరం 2002 నుంచి సొంత బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ.. 2007లో భారత్‌లో, 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి : ట్రంప్ ప్ర‌భుత్వంలోకి మ‌స్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు

ప్రస్తుతం 50కి పైగా జెనరిక్ మందులను ఉత్పత్తి చేస్తూ ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్ సహా తొమ్మిది దేశాలకు ఎగుమతి చేస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదురైనా సుమీలోని ఈ ప్లాంట్ ఉత్పత్తిని కొనసాగిస్తూ వచ్చింది. కానీ తాజా దాడితో ప్లాంట్‌కు భారీ విఘాతం ఏర్పడింది.

Indian-Run Kusum Pharma Plant Destroyed in Russian Drone Attack in Ukraine

వేగవంతమైన డ్రోన్లతో రష్యా దాడులు

ఇటీవలి కాలంలో రష్యా తక్కువ ఖర్చుతో వేగంగా దూసుకొచ్చే జెట్ ఆధారిత 'షాహెద్' డ్రోన్లను ఉక్రెయిన్‌పై నిత్యం ప్రయోగిస్తోంది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని అడ్డుకోవడంలో తీవ్ర శ్రమ పడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సుమారు 250 కి.మీ రేంజ్ గల 'ఎఫ్‌పీ-7' (FP-7) బాలిస్టిక్ క్షిపణిని ఈ వారంలోనే యుద్ధరంగంలోకి దించినట్లు ప్రకటించింది.

Indian-Run Kusum Pharma Plant Destroyed in Russian Drone Attack in Ukraine

Advertisement
Advertisement