త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elon Musk | ట్రంప్ ప్ర‌భుత్వంలోకి మ‌స్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు

Elon Musk | టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ (Elon Musk) మ‌ళ్లీ ట్రంప్ ప్ర‌భుత్వంలోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ యంత్రాంగం అమెరికా రక్షణ శాఖలో మ‌స్క్‌కు కీలక బాధ్యతలు అప్ప‌గించింది. పెంటగాన్ (Pentagon) ప్రారంభించిన సరికొత్త ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ "మెరిడియన్" (Project Meridian)కు మ‌స్క్‌ నాయకత్వం వహించనున్నారు.

D

International | Published On Oct 1, 2026, 11.36 am IST

Elon Musk | ట్రంప్ ప్ర‌భుత్వంలోకి మ‌స్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
Advertisement

Elon Musk | త్రినేత్ర న్యూస్ : ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ (Elon Musk) మ‌ళ్లీ ట్రంప్ ప్ర‌భుత్వంలోకి ఎంట్రీ ఇచ్చారు. భవిష్యత్తు యుద్ధాలు (future of warfare), అమెరికా సైన్యానికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేయడానికి పెంటగాన్ (Pentagon) ప్రారంభించిన సరికొత్త ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ "మెరిడియన్" (Project Meridian)కు మ‌స్క్‌ నాయకత్వం వహించనున్నారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ గురువారం జరిగిన 'స్టేట్ ఆఫ్ ది ఫోర్స్' ప్రసంగంలో ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రకటించారు.

భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి..? వాటిని ఎదుర్కొనేందుకు యూఎస్ మిలిటరీకి ఎలాంటి అధునాతన సాంకేతికత అవసరం..? వంటి కీల‌క అంశాల‌ను విశ్లేషించ‌డ‌మే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రక్షణ శాఖ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) ఎమిల్ మైఖేల్ (Emil Michael) పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ పనిచేయ‌నుంది. ఈ హై-లెవెల్ అడ్వైజరీ ప్యానెల్‌కు మస్క్‌తోపాటూ రక్షణ రంగ సంస్థ ఆండ్యూరిల్‌ వ్యవస్థాపకుడు పామర్‌ లక్కీ, అమెరికా మాజీ ప్రతినిధుల సభ స్పీకర్‌ న్యూట్‌ గింగ్రిచ్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. భవిష్యత్తు యుద్ధాల్లో అమెరికాకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన ఆయుధ వ్యవస్థలు, సైనిక సామర్థ్యాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది. ప్రాజెక్టు ప్రారంభమైన 120 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇందులోని ప్రధాన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అదే సమయంలో సైనిక నాయకత్వం కోసం ప్రత్యేకంగా ఒక రహస్య నివేదికను కూడా ఈ బృందం సమర్పించ‌నుంది.

అటానమస్ వార్‌ఫేర్ కమాండ్

దీంతోపాటూ సంయుక్త ద‌ళాల్లో అటాన‌మ‌స్‌, రోబోటిక్ వ్య‌వ‌స్థ‌ల‌ను వేగ‌వంతం చేయ‌డానికి 'అటానమస్ వార్‌ఫేర్ కమాండ్' పేరుతో సరికొత్త ఫోర్-స్టార్ కమాండ్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా, భవిష్యత్ తరాల ఆటానమస్ వారియర్ల కోసం ప్రత్యేక ఉద్యోగ నియామక విధానాలను కూడా రూపొందించనున్నట్లు వెల్లడించారు.

అప్పుడు త‌ప్పుకొని.. ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ

దేశంలోని వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) శాఖకు గ‌తంలో మ‌స్క్ అధిప‌తిగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. మ‌స్క్‌తోపాటూ భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) కూడా ఈ శాఖ‌ సార‌థిగా వ్య‌వ‌హరించారు. అయితే కొన్ని రోజుల‌కే రామ‌స్వామి డోజ్ నుంచి త‌ప్పుకోవ‌డంతో మొత్తం మ‌స్కే చూసుకోవాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో మస్క్‌ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ట్రంప్‌ యంత్రాంగాన్ని ఎలాన్‌ మస్క్‌ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డోజ్‌లో మస్క్‌ ఉద్యోగి కాదని.. ట్రంప్‌ సలహాదారుడిగా మాత్రమే మస్క్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారని వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఆ త‌ర్వాత ట్రంప్ తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్ విష‌యంలో ట్రంప్‌తో మ‌స్క్‌కు విభేదాలు త‌లెత్తాయి. అవికాస్తా తారాస్థాయికి చేర‌డంతో మిత్రులు కాస్తా శత్ర‌వులుగా మారారు. అనంత‌రం డోజ్‌నుంచి మ‌స్క్ అనూహ్యంగా త‌ప్పుకోవ‌డం అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు మ‌ళ్లీ ట్రంప్ టీమ్‌లోకి మ‌స్క్ రీ ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read..

ఫారమ్-6లో మార్పులు చేయ‌మ‌ని టీసీఎస్‌ను ఎవ‌రు ఆదేశించారు..? ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌శ్నించిన రాహుల్‌

ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియ‌న్ పైల‌ట్‌పై ఇజ్రాయెల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

అత‌డు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మ‌చ్చ‌ర్‌ను కొనియాడిన ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement